జమిలి ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు

జమిలి ఎన్నికలకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

Last Updated : Jul 8, 2018, 02:03 PM IST
జమిలి ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు

జమిలి ఎన్నికలకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీ వినోద్ కుమార్ ఆదివారం లా కమిషన్‌ను కలిసి టీఆర్‌ఎస్ అభిప్రాయాన్ని వెల్లడించారు. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై లా కమిషన్ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తోందనే సంగతి తెలిసిందే! దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు తమ పార్టీ అనుకూలమని ఎంపీ వినోద్ కుమార్ నేతృత్వంలోని టీఆర్ఎస్ బృందం లా కమిషన్‌కు స్పష్టం చేసింది. జమిలి ఎన్నికల కోసం తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల నిర్వహణకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు.

లా కమిషన్‌ను కలసిన తరువాత ఎంపీ వినోద్ మాట్లాడుతూ.. జ‌మిలి ఎన్నిక‌ల‌పై సీఎం కేసీఆర్ లేఖ‌ను లా క‌మిష‌న్‌కు అందించామన్నారు. జమిలి ఎన్నికలపై 1983 నుంచి జాతీయ న్యాయ కమిషన్ చర్చిస్తోందని.. జమిలి ఎన్నికలంటే మోదీ సర్కార్ తెచ్చిన తెచ్చిన కొత్త విధానం అనుకుంటున్నారని.. మోదీ కంటే ముందు నుంచే ఈ అంశంపై చర్చ జరుగుతోందన్నారు. ఈ విధానంతో ఐదేళ్లపాటు కేంద్ర, రాష్ర్టాల పాలన సుగమంగా సాగుతుందన్నారు.  

 

కాగా ఈ దఫా జరిగే పార్లమెంట్‌ సమావేశాల నాటికి జమిలి ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు పలు రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికల విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

Trending News