హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర నిధుల మంజూరీకి సంబంధించి తెలంగాణ బీజేపీ నేతల దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు గత ఐదేళ్లల్లో ఇచ్చిన నిధులపై గణాంకాలు విడుదల చేసిన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై తెరాస మండిపడింది.
2014 నుంచి 2019 వరకు తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్లిన ఆదాయం 2 లక్షల 72 వేల 926 రూపాయలు అయితే ఇదే కాలంలో కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన మొత్తం లక్షా 12 వేల 854 రూపాయలు మాత్రమేనని తెరాస పేర్కొంది.
గతంలో అమిత్ షా, తెలంగాణకు కేంద్ర నిధులపై దుష్ప్రచారం చేస్తే సీఎం కేసీఆర్ వెంటనే కౌంటర్ ఇచ్చేసరికి తోక ముడిచి పారి పోయారని గుర్తు చేశారు. రాష్ట్రాలకు కేంద్రం నిధుల కేటాయింపును పెంచే బదులుగా తగ్గించడం అన్యాయమని ఇప్పటికే పలు దఫాలుగా సీఎం కేసీఆర్ కేంద్రానికి పలు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు గత ఐదేళ్లలో సగటున 25 వేల కోట్ల రూపాయలు కూడా రాలేదంటే స్థానిక బీజేపీ నేతలు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్రానికి నిధుల కేటాయింపు పెరిగేలా ఒత్తిడి పెంచాలని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..