టీఎస్ఎస్‌పీడీసీఎల్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

టీఎస్ఎస్‌పీడీసీఎల్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Last Updated : Oct 30, 2019, 10:10 PM IST
టీఎస్ఎస్‌పీడీసీఎల్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ : ఇటీవలే 3,025 పోస్టుల భర్తీకి వేర్వేరుగా మూడు నోటిఫికేషన్లు జారీ చేసిన తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కొర్పొరేషన్ లిమిటెడ్‌(టీఎస్ఎస్‌పీడీసీఎల్‌) తాజాగా మరో 500 ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. డిగ్రీ అర్హతతో ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి 500 జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకుగాను గురువారం నుంచి దరఖాస్తులు స్వీకరించనుంచనున్నారు. నవంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది. 

18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండి, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు అర్హులుగా టీఎస్ఎస్‌పీడీసీఎల్‌ ప్రకటించింది. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు రూ.100, ఎగ్జామ్ ఫీజు రూ.120 కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు పరీక్ష ఫీజులో మినహాయింపు ఇస్తున్నట్టు టీఎస్ఎస్‌పీడీసీఎల్‌ స్పష్టంచేసింది.

Trending News