Bandi Sanjay: ఎందుకీ హై‘డ్రామా’లాడులు..? హైడ్రాపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

Bandi Sanjay On Hydra: హైడ్రాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి ఫైర్ అయ్యారు. హైడ్రా పేరుతో ఈ డ్రామాలు ఎందుకని ప్రశ్నించారు. తాను హైడ్రాను సమర్థించానని.. కానీ షాపులను, పేదల ఇండ్లను కూలిస్తే సహించేది లేదని హెచ్చరించారు.    

Written by - Ashok Krindinti | Last Updated : Sep 9, 2024, 04:00 PM IST
Bandi Sanjay: ఎందుకీ హై‘డ్రామా’లాడులు..? హైడ్రాపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

Bandi Sanjay On Hydra: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు ‘హైడ్రా’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాలాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మండిపడ్డారు. గత కొద్దిరోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే విశ్వాసం పోతోందన్నారు.  సామాన్యులను కూడా ఇబ్బంది  పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను  మొదట హైడ్రాకు   సపోర్ట్  చేసిన. పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలను, విల్లాలను, ఫాంహౌజ్ లను కూలిస్తే సమర్ధించిన... కానీ పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను, పేదల ఇండ్లను కూలుస్తున్నరు. ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు సరికాదు. ఎందుకీ హైడ్రామాలు? అక్రమ భవనాలకు, ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో కడుతున్న ఇండ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడెందుకు కూలుస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.’’ అని చెప్పారు.

Also Read: Air Taxi in India: ఇక ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి, ఎప్పుడు ఏ నగరంలోనంటే

బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు. "దేశం, సమాజం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. 18 కోట్ల సభ్యత్వ నమోదు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన పార్టీ బీజేపీ. ఈసారి మరో 10 కోట్ల మందిని సభ్యులుగా చేర్చాలని హైకమాండ్ నిర్ణయించింది. తెలంగాణలో 77 లక్షల మంది పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేశారు. వాళ్లందరినీ బీజేపీ సభ్యలుగా చేర్చాలిన అవసరం ఉంది. అదే విధంగా సభ్యత్వ నమోదులో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అగ్రభాగాన ఉండాలి. అది జరగాలంటే ప్రతి పోలింగ్ బూత్ లోనూ అత్యధిక సభ్యత్వాన్ని నమోదు చేయాలి. అత్యధిక సభ్యత్వాన్ని నమోదు చేసిన పోలింగ్ బూత్ కమిటీలను సన్మానిస్తా.  

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే... అత్యధికంగా బీజేపీ సభ్యులుగా చేర్చాల్సిన అవసరం ఉంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనుకునే వాళ్లకు ఇది మంచి అవకాశం. పార్టీ కోసం  పని చేసే వారికే  టికెట్లు ఇస్తాం. ఈ విషయంలో నా దగ్గర పైరవీలు నడవవు. ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు? ఎవరు స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో ఎప్పటికప్పుడు నివేదికలొస్తున్నాయి. బీఆర్‌ఎస్  అవుట్ డేటెడ్  పార్టీ. రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్‌కు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. కేసీఆర్ ఎన్ని యాగాలు చేసినా ఉపయోగం లేదు. బిడ్డ  జైలు  నుంచి  బయటకు  రాగానే  యాగం  చేస్తున్నాడు. చేతనైతే వరదలవల్ల  నష్టపోయిన  వారి కోసం  కేసీఆర్ యాగాలు  చేయాలి. రాష్ట్రమంతా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతుంటే కేసీఆర్ కనీసం ఎందుకు స్పందించడం లేదు? ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా సీఎంతో మాట్లాడారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాష్ట్రంలో ఏరియల్ సర్వే చేశారు. కానీ ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ వరద బాధితులను పరామర్శించలేదు? కనీసం ఎందుకు స్పందించడం లేదు? అందుకే ప్రజలంతా ఆయనకు  ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టేశారు.

కాంగ్రెస్  పార్టీ పట్ల  ప్రజల్లో  విరక్తి  మొదలైంది. అతి తక్కువ కాలంలో ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఇగ కాంగ్రెస్  ఇచ్చిన  హామీలను  నెరవేర్చకుండా ...హైడ్రా పేరుతో  డైవర్ట్  చేస్తూ హైడ్రామాలాడుతోంది. హైడ్రాతో సామాన్యులను ఇబ్బంది  పెడుతున్నారు. హైడ్రా పై  విశ్వాసం  పోతుంది. నేను  మొదట హైడ్రా  కి  సపోర్ట్  చేశాను. పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలను, విల్లాలను, ఫాంహౌజ్ లను కూలిస్తే సమర్ధించినం... కానీ పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను,  పేదల ఇండ్లను కూలుస్తున్నరు. ఊరుకునే ప్రసక్తే లేదు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు సరికాదు. అక్రమ భవనాలకు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో కడుతున్న ఇండ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడెందుకు కూలుస్తున్నారో సమాధానం చెప్పాలి. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవాలి.." అని డిమాండ్ చేశారు.

Also Read: Air Taxi in India: ఇక ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి, ఎప్పుడు ఏ నగరంలోనంటే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News