Telangana Politics: రేవంత్ రెడ్డికి షాకిచ్చేలా రాజకీయాలు.. తెలంగాణలో ఆ రెండు పార్టీలు కలిసిపోతాయా?

Telangana Politics: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీపై మొదటి నుంచి దూకుడుగా పోరాడుతున్నారు రేవంత్ రెడ్డి. టీడీపీలో ఉన్నప్పుడే కేసీఆర్ ఫ్యామిలీని ఓ రేంజ్ లో ఆయన టార్గెట్ చేశారు. ఓటుకు నోటు కేసులో జైలుకు కూడా వెళ్లారు. జైలు నుంచి వచ్చాక కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు రేవంత్ రెడ్డి.

Written by - Srisailam | Last Updated : Sep 26, 2022, 12:28 PM IST
  • ఢిల్లీలో మారుతున్న సమీకరణలు
  • కాంగ్రెస్ కూటమిలోనే టీఆర్ఎస్?
  • కేసీఆర్, రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తారా?
Telangana Politics: రేవంత్ రెడ్డికి షాకిచ్చేలా రాజకీయాలు.. తెలంగాణలో ఆ రెండు పార్టీలు కలిసిపోతాయా?

Telangana Politics: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీపై మొదటి నుంచి దూకుడుగా పోరాడుతున్నారు రేవంత్ రెడ్డి. టీడీపీలో ఉన్నప్పుడే కేసీఆర్ ఫ్యామిలీని ఓ రేంజ్ లో ఆయన టార్గెట్ చేశారు. ఓటుకు నోటు కేసులో జైలుకు కూడా వెళ్లారు. జైలు నుంచి వచ్చాక కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో చేరాక కూడా అదే స్పీడ్ కొనసాగిస్తున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ గా మరింత వాయిస్ పెంచారు. ఏ సభలో మాట్లాడినా కల్వకుంట్ల ఫ్యామిలీనే ఆయన టార్గెట్. కేసీఆర్ ను ఓడించడమే తన లక్ష్యమని చెబుతారు రేవంత్ రెడ్డి. అయితే కేసీఆర్ తో పోరాడుతున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కూటమిగా ఏర్పడితే ఏం చేస్తారన్న ప్రశ్నలు మొదటి నుంచి వస్తున్నాయి. ఈ విషయంలోనూ పలు సార్లు క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

సీఎం కేసీఆర్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి పని చేసేది లేదని రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు ఉండే ఛాన్సే లేదన్నారు. తాను కేసీఆర్ తో కలిసి పనిచేయడం కలలో కూడా జరగదన్నారు. తాను చెప్పడమే కాదు ఈ అంశంలో రాహుల్ గాంధీ నోటి నుంచి మాట వినిపించారు. వరంగల్ లో జరిగిన రైతు గర్జన సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ కు భవిష్యత్ లో ఏ విధమైన సంబంధాలు ఉండబోవని ప్రకటించారు. రేవంత్ రెడ్డి కావాలనే రాహుల్ తో ఈ మాట చెప్పించారనే టాక్ నడిచింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పనిచేసే అవకాశం లేదని రేవంత్ రెడ్డి పదేపదే చెబుతుండటం.. రాహుల్ గాంధీ కూడా అదే మాట చెప్పడంతో.. ఆ రెండు పార్టీలు కలవడం అసాధ్యమని అంతా భావించారు. కాని తాజాగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు మాత్రం మరోలా ఉన్నాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవరపరిచేలా సమీకరణలు మారిపోతున్నాయి.

కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బీజేపీ ముక్త భారత్ అంటూ నినదిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు చేశారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లి  ముఖ్యమంత్రులు, పలు పార్టీల అధినేతలో చర్చలు జరిపారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే తన లక్ష్యమని చెబుతూ వస్తున్నారు. అయితే  ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్  జాతీయ రాజకీయాలు కాంగ్రెస్ కూటమి వైపు కదులుతున్నట్లుగా కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ మిత్రుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని కలిశారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిసి దాదాపు మూడేళ్ల తర్వాత సోనియాను కలిసిన నితీష్.. జాతీయ రాజకీయాలపైనే చర్చించారు. సోనియాతో భేటీ తర్వాత మాట్లాడిన నితిష్.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కూటమి మధ్య పోటీ ఉంటుందని చెప్పారు.  ధర్డ్ ఫ్రంట్, ఫస్ట్ ఫ్రంట్ అనేవి ఉండవని తేల్చి చెప్పారు. తాను కాంగ్రెస్ కూటమిలోనే ఉంటానని నితీష్ క్లారిటీ ఇచ్చారు.

ఇక హర్యానాలో ఇండియన్ లోక్ దళ్ అధినేత ఓం ప్రకాష్ చౌతాలా నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశానికి నితీష్ కుమార్ తో పాటు  ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ  అధినేత శరద్ పవార్,  సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని  కలుపుకుని ముందుకు వెళ్తామని ఈసభలో  నేతలు సంకేతం ఇచ్చారు. నితీష్ లాలూ,  శరద్ పవార్ వంటి పెద్ద నేతలే కాంగ్రెస్ తో కలసి నడవడానికి ఓకే చెప్పడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా అదే బాటలో నడవచ్చని అంచనా వేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి నడవడానికి తమకు అభ్యంతరం లేదని ఇటీవలే ములాయం సింగ్ యాదవ్ ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న కొన్ని పార్టీలను సైతం తమతో కలిసివచ్చేలా చూస్తామని సోనియాతో నితీశ్, లాలూ మాట్లాడారని తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్, వైసీపీ, బీఎస్పీ, ఆప్, బీజూ జనతాదళ్, కశ్మీర్ లోని పీడీఎఫ్ పార్టీలను కాంగ్రెస్ కూటమిలో కలిసి వచ్చేలా చర్చలు సాగుతున్నాయని సమాచారం.

జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించడమే తన లక్ష్యమంటున్నారు కేసీఆర్. ఈ విషయంలోనే ఆయన ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే, జేడీఎస్ అధినేత దేవేగౌడతో మంతనాలు సాగించారు. కమ్యూనిస్టు పార్టీల జాతీయ నేతలతోనూ ప్రగతి భవన్ లో కేసీఆర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. కేసీఆర్ తో మంతనాలు సాగించిన పార్టీల అధినేతలంతా ఇప్పుడు కాంగ్రెస్ కూటమిలో ఉంటామని చెప్పడంతో.. కేసీర్ కూడా ఆ కూటమిలో కలవాల్సిన తప్పనిసరి పరిస్థితి నెలకొంది. అదే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ తో టీఆర్ఎస్ కలిసిపోతే.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏం చేస్తారన్నది ఆసక్తికరమే. జాతీయ స్థాయిలోనే పొత్తు.. రాష్ట్రంలో సంబంధం లేదంటూ తన పని తాను చేసుకుపోతారా లేక మరేదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. తాజా పరిణామాలతో బీజేపీ వాయిస్ మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.  

Also read: LAXMI PARVATHI : హెరిటేజ్ పాలు తాగే కక్కులు అరుస్తున్నాయ్.. చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ చనిపోయారన్న లక్ష్మిపార్వతి

Also read: 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. దసరాకు డబ్బేడబ్బు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News