Diabetes Treatment: డయాబెటిస్ నివారణలో తొలి విజయం, అమెరికన్ శాస్త్రవేత్తల ప్రయోగం సక్సెస్

Diabetes Treatment: డయాబెటిస్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. నియంత్రణే తప్ప చికిత్స లేని వ్యాధిగా ఆందోళన కల్గిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. డయాబెటిస్ వ్యాధిపై జరుగుతున్న పరిశోధనల్లో కీలక విజయం లభించినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 11, 2023, 07:25 PM IST
Diabetes Treatment: డయాబెటిస్ నివారణలో తొలి విజయం, అమెరికన్ శాస్త్రవేత్తల ప్రయోగం సక్సెస్

Diabetes Treatment Protocol: ఆధునిక జీవనశైలి కారణంగా తలెత్తుతున్న వ్యాధుల్లో కీలకమైంది డయాబెటిస్. పూర్తిగా ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఆధారంగా ఈ వ్యాధి తలెత్తుతుంటుంది. అందుకే ఈ వ్యాధి నియంత్రణ కూడా ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. మొదటిసారిగా డయాబెటిస్ నివారణ దిశగా జరుగుతున్న పరిశోధనల్లో అమెరికన్ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. 

డయాబెటిస్ అనేది చాలాకాలంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇటీవలి కాలంలో అయితే టీనేజ్ వయస్సుకే డయాబెటిస్ బారిన పడుతున్న పరిస్థితి కన్పిస్తోంది. దీనంతటికీ కారణం ఆధునిక జీవనశైలి. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమౌతోంది. బిజీ లైఫ్ కారణంగా జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం ఈ సమస్యకు ప్రధాన కారణం. మరోవైపు శారీరకంగా శ్రమ లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం కూడా ఇతర కారణాలు. దురదృష్ఠమేమంటే డయాబెటిస్‌కు నియంత్రణే తప్ప నివారణ లేకపోవడంతో పెను సమస్యగా మారుతోంది. 

అందుకే ఏళ్ల తరబడి డయాబెటిస్ వ్యాధిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. డయాబెటిస్ నివారణకు చికిత్స కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈ పరిశోధనల్లో పరిశోధకులు ముందడుగు వేసినట్టుగా తెలుస్తోంది. అమెరికన్ సైంటిస్టులు ఈ దిశగా విజయం సాధించారు. ఎలుకలపై చేసిన ప్రయోగంలో టైప్ డయాబెటిస్‌ను విజయవంతంగా తగ్గించగలిగారు. ఈ ప్రయోగం వివరాలు ఇలా ఉన్నాయి...

అమెరికన్ శాస్త్రవేత్తల ప్రయోగం ఇలా

డయాబెటిస్ నివారణకు అమెరిక్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో స్టెమ్‌సెల్స్ కీలకభూమిక పోషించాయి. జీర్ణాశయపు స్టెమ్‌సెల్స్‌ను ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలుగా మార్చడంలో కెర్నెల్ యూనివర్శిటీ చెందిన వీల్ కార్నెల్ మెడిసిన్ కాలేజీ పరిశోధకులు విజయం సాధించారు. సాధారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు పాంక్రియాస్ నుంచి కావల్సిన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంటుంది. ఈ ఇన్సులిన్ గ్లూకోజ్ కన్వర్షన్ ప్రక్రియను పూర్తి చేసి అప్పుడు రక్తంలో కలిసేలా చేస్తుంది. అయితే ఇన్సులిన్ ఉత్పత్తి సామర్ధ్యం పడిపోయినప్పుడు గ్లూకోజ్ కన్వర్షన్ ప్రక్రియ నిలిచిపోయి నేరుగా రక్తంలో కలిసిపోతుంది. డయాబెటిస్ వ్యాధికి కారణమౌతుంది. ఇన్సులిన్ కారణంగా వచ్చే మధుమేహాన్ని టైప్ 1 డయాబెటిస్‌గా పిలుస్తారు. అమెరికన్ పరిశోధకులు టైప్ 1 డయాబెటిస్‌పైనే పరిశోధన చేశారు. 

వాస్తవానికి జీర్ణాశయ స్టెమ్‌సెల్స్‌కు కూడా శరీరంలోని వివిధ రకాల కణాలుగా మారే సామర్ధ్యం ఉంటుంది. అమెరికన్ సైంటిస్టులు ఈ అంశాన్నే సానుకూలంగా మల్చుకున్నారు. మూడు ప్రోటీన్ల సహాయంతో స్టెమ్‌సెల్స్‌ను కాస్తా ఇన్సులిన్ ఉత్పత్తి చేసే గ్యాస్ట్రిక్ ఇన్సులిన్ సెక్రెటింగ్ కణాలుగా మార్చగలిగారు. ఈ కణాలు కొద్దిరోజుల వ్యవధిలో గ్లూకోజ్ లెవెల్స్ గుర్తించి ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. ఈ కణాల పనితీరును 6 నెలలపాటు పర్యవేక్షించామని ఇప్పటి వరకూ బాగా పనిచేస్తున్నాయని చెప్పారు కార్నిగో విశ్వవిద్యాలయం పరిశోధకులు. 

ఎలుకలపై చేసిన ప్రయోగం విజయవంతమైనా ఇంకా రీసెర్చ్ చేయాల్సిన అవసరముందన్నారు కెర్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఎందుకంటే మనుషులు, ఎలుకల జీర్ణాశయ కణాల్లో కొన్ని తేడాలున్నందున మరింత పరిశోధన అవసరమన్నారు. అన్ని దశలు దాటితే ఇన్సులిన్ ఉత్పత్తిని శరీరమే సహజంగా చేసుకోగలదు. నిజంగా ఈ ప్రయోగం డయాబెటిస్ నివారణలో గొప్ప బ్రేక్ త్రూ కాగలదు. 

Also read: Pakistan Heavy Rains: బిపర్‌జోయ్ ప్రభావం పాకిస్తాన్‌లో వర్ష బీభత్సం, 25 మంది మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News