Dhaka: మసీదులో పేలుడు..11 మంది మృతి

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మసీదు కిందనుంచి వెళ్తున్న పైప్ లైన్ ఒక్కసారిగా పేలడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Last Updated : Sep 5, 2020, 02:36 PM IST
Dhaka: మసీదులో పేలుడు..11 మంది మృతి

బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ( Dhaka ) లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మసీదు కిందనుంచి వెళ్తున్న పైప్ లైన్ ( Pipelinel blast ) ఒక్కసారిగా పేలడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఢాకాలో మరోసారి పేలుడు సంభవించింది. నగరంలోని బైతుస్ సలాత్ జేమ్ మసీదులో ( Blast in Mosque ) ఈ ఘోరం జరిగింది. మసీదు కింది నుంచి గ్యాస్ పైప్ లైన్ వెళ్తోంది. దురదృష్టవశాత్తూ ఈ పైప్ లైన్ లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దాంతో మసీదు ధ్వంసమైంది. మసీదులోని 6 ఏసీలు కూడా మంటల తీవ్రతకు పేలిపోయాయి. అదే సమయంలో మసీదులో ప్రార్ధనలు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పేలుడు ఘటనతో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మందికి తీవ్రగాయాలై..ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. 90 శాతం పైగా గాయాలతో ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. ఈ ఘటనపై ఢాకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also read: US Elections: ఈసారి హిందూ ఓటుబ్యాంకు ఎటు?

Trending News