Boris Johnson Marriage: ప్రియురాలిని సీక్రెట్‌గా వివాహం చేసుకున్న UK PM బోరిస్ జాన్సన్ 

UK PM Boris Johnson Wedding : కరోనా సమయంలో కోవిడ్19 నిబంధనలు పాటిస్తూ ప్రియురాలిని అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లాడారా.. తన వివాహేతర సంబంధాల వివాదాలకు చెక్ పెట్టారా.. బ్రిటన్ స్థానిక మీడియా అవుననే అంటోంది.

Written by - Shankar Dukanam | Last Updated : May 30, 2021, 09:35 AM IST
  • బ్రిటన్ ప్రధాన మంత్రి బొరిస్ జాన్సన్ సీక్రెట్ వివాహం
  • తన ప్రియురాలు క్యారీ సైమండ్స్‌ను మ్యారేజ్ చేసుకున్న యూకే పీఎం
  • ఏప్రిల్ నెలలో వీరికి సంతానం ఓ కుమారుడు కలిగాడు, ఈ క్రమంలో పెళ్లి
Boris Johnson Marriage: ప్రియురాలిని సీక్రెట్‌గా వివాహం చేసుకున్న UK PM బోరిస్ జాన్సన్ 

UK PM Boris Johnson Wedding | బ్రిటన్ ప్రధాన మంత్రి రహస్యంగా వివాహం చేసుకున్నారా, కరోనా సమయంలో కోవిడ్19 నిబంధనలు పాటిస్తూ ప్రియురాలిని అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లాడారా.. తన వివాహేతర సంబంధాల వివాదాలకు చెక్ పెట్టారా.. బ్రిటన్ స్థానిక మీడియా అవుననే అంటోంది.

బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్(56) తన ప్రియురాలు క్యారీ సైమండ్స్‌(33)ను వివాహం (Boris Johnson Marries Carrie Symonds) చేసుకున్నారు. కేవలం కొందరు సన్నిహితుల సమక్షంలో కోవిడ్19 నిబంధనలు పాటిస్తూ మ్యారేజ్ చేసుకున్నారని  వైరల్ అవుతోంది. వెస్ట్ మినిస్టర్ క్యాథలిక్ క్యాథడ్రల్ ఈ వివాహ వేడుకకు శనివారం నాడు వేదికగా మారినట్లు సమాచారం. ద సన్, ద మెయిల్ న్యూస్‌పేపర్స్ యూకే పీఎం బోరిస్ జాన్సన్(UK PM Boris Johnson) వివాహం జరిగిందని రిపోర్ట్ చేశాయి. వివాహానికి అథితులకు సైతం చివరి నిమిషంలో ఆహ్వానాలు అందినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

Also Read: SBI Cash Withdrawal Rules: క్యాష్ విత్‌డ్రా పరిమితి పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

వివాహం నిర్వహించే చర్చికి కేవలం అరగంట ముందుగా తెల్లని దుస్తులు ధరించిన వధువు క్యారీ సైమండ్స్ చేరుకున్నారు. అనంతరం బోరిస్ జాన్సన్, క్యారీ సైమండ్స్ వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇంగ్లాండ్‌లో కోవిడ్-19 (COVID-19) నిబంధనలు అమల్లో ఉన్న కారణంగా వివాహ వేడుకకు కేవలం 30 మందికే అనుమతి ఉంది. నిబంధనలు పాటించినట్లు స్థానిక న్యూస్‌పేపర్లు రిపోర్ట్ చేశాయి. అయితే జాన్సన్ అధికార ప్రతినిధులు మాత్రం వివాహంపై స్పందించడానికి నిరాకరించారు.

Also Read: Best Pension Plans: బెస్ట్ పెన్షన్, సేవింగ్స్ ప్లాన్ కావాలంటే ఈ వివరాలు చదవండి

బోరిస్ జాన్సన్ 2019లో యూకే ప్రధాని అయ్యాక అప్పటినుంచి అధికారిక భవనం డౌనింగ్ స్ట్రీట్‌లో తన ప్రియురాలు క్యారీ సైమండ్స్‌తో కలిసి ఉంటున్నారు. తమ నిశ్చితార్థం విషయాన్ని గత ఏడాది వెల్లడించారు. ఈ ఏప్రిల్‌లో వీరికి సంతానం కుమారుడు విల్‌ఫ్రెండ్ నికోల్స్ కలిగాడు. బోరిస్ జాన్సన్ 2018లో తన భార్య మరినా వీలర్ నుంచి విడాకులు తీసుకున్నారు. వీరికి సంతానం నలుగురు పిల్లలు ఉన్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News