Covid19: రెండున్నర ఏళ్లు గడిచినా కొవిడ్ మహమ్మారి పీడ పోవడం లేదు. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. తాజాగా కొవిడ్ పుట్టినిల్లు చైనాలో కలకలం రేగింది. చైనాలొ కొవిడ్ కొత్త వేరియంట్ వెలుగుచూసింది. దీంతో చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. చైనాలోని ఒక నగరంలో ఒకడిరి కొవిడ్ నిర్దారణ కాగా.. ఆ నగరాన్ని మొత్తం లాక్ చేశారు. ఆ సిటీలో మూడు లక్షల మంది నివసిస్తుండగా.. వారందరని క్వారంటైన్ లో ఉంచారు అక్కడి అధికారులు.
చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని వుగాంగ్ సిటీలో కొవిడ్ కొత్త కేసు నమోదైంది. నగరానికి చెందిన ఓ వ్యక్తికి కొవిడ్ సోకింది. అతనిలో ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ B.A.5.2.1 అనే కొత్త రకాన్ని గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలో జులై 8న ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. కొత్త వేరియంట్ సోకినట్లు తేలడంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ విస్తరించకుండా కఠిన ఆంక్షలు విధించింది. వుగాంగ్ లో మూడు రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించారు. ప్రభుత్వ ఆంక్షలతో వుగాంగ్ సిటీలోని మొత్తం మూడు లక్షల 20 వేల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. గురువారం మధ్యాహ్నం వరకు ఏ ఒక్కరు ఇంటి నుంచి బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు.ఇళ్లకే పరిమితమైన ప్రజలకు నిత్యావసరాలు ప్రభుత్వమే సమకూరుస్తోంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రం కారులో వెళ్లేందుకు స్థానిక అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించింది. రూల్స్ అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని వుగాంగ్ అధికారులు హెచ్చరించారు.
రెండు నెలల క్రితం షాంఘైలో కొవిడ్ కేసులు పెరగడంతో లాక్ డౌన్ పెట్టారు. కేసుల తీవ్రత తగ్గడంతో జూన్ మొదటి వారంలో ఎత్తేశారు. ఇంతలోనే కొత్త వేరియంట్ వెలుగు చూడటంతో షాంఘైలో మళ్లీ కఠిన ఆంక్షలు విధించారు. కొవిడ్ వైరస్ కట్టడికి చైనాలో కఠిన ఆంక్షలు విధించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 25 కోట్ల మంది ఏదో ఒక రకమైన ఆంక్షల చట్రంలో ఉన్నట్లు జపనీస్ బ్యాంక్ నోమురా తెలిపింది. గత వారంతో పోలిస్తే ఆ సంఖ్య రెండింతలు అయింది.
Read also: Revanth Reddy: కమలంలో రేవంత్ రెడ్డి కలకలం.. గజ్వేల్ లో ఈటల పోటీ చేసేది బీజేపీ నుంచి కాదా?
Read also: Revanth Reddy: ఎకరానికి రూ.15 వేలు ఇవ్వండి..పంట నష్టంపై సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ..!
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook