Donald Trump: కమలా హ్యారిస్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) వివాదాస్పద వ్యాఖ్యలు ఆగడం లేదు. డెమోక్రటిక్ పార్టీ ( Democratic party ) తరపున అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా జో బిడెన్, కమలా హ్యారిస్ లను ప్రకటించినప్పటి నుంచి  ట్రంప్ ఆక్రోశం ఎక్కవవుతోంది.

Last Updated : Aug 15, 2020, 09:57 PM IST
Donald Trump: కమలా హ్యారిస్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) వివాదాస్పద వ్యాఖ్యలు ఆగడం లేదు. డెమోక్రటిక్ పార్టీ ( Democratic party ) తరపున అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా జో బిడెన్, కమలా హ్యారిస్ లను ప్రకటించినప్పటి నుంచి  ట్రంప్ ఆక్రోశం ఎక్కవవుతోంది.

డెమోక్రటిక్ పార్టీ తన తరపున అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు అభ్యర్ధులుగా జో బిడెన్ ( joe bidden ), కమలా హ్యారిస్ ( kamala harris ) లను ప్రకటించింది. అప్పట్నించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( America president donald trump ) వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి అదే పని చేశారు. ఆ ఇద్దరూ గెలిస్తే..పోలీస్ స్టేషన్లను రద్దు చేసేస్తారని ట్రంప్ ఆరోపించారు. ఓ కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. జో బిడెన్ కంటే..కమలా హ్యారిస్ మరింత అధ్వాన్నంగా ప్రవరిస్తుందని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. దీనికంటే ముందు కమలా హ్యారిస్ అమెరికాలో పుట్టలేదని..ఆమెకు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యే అర్హత లేదని విమర్శించారు. ఓ నల్లజాతి మహిళ అమెరికన్ల అవసరాలు తీర్చలేదంటూ జాత్యాహంకార వ్యాఖ్యలు కూడా చేశారు. మరోవైపు కమలా హ్యారిస్ కంటే తనకే ఎక్కువమంది భారతీయులు తెలుసని..తనవైపే ఎక్కువమంది ఇండియన్స్  ఉన్నారని డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. Also read: Corona vaccine: ఫస్ట్ బ్యాచ్ ఉత్పత్తిని పూర్తి చేసిన రష్యా

Trending News