Elon Musk Loses 15 Billion Dollars With One Tweet Over Bitcoin: ప్రపంచ కుబేరులలో ఒకరైన టెస్లా కార్ల కంపెనీ అదినేత ఎలాన్ మస్క్ చేసిన ఒక్క చిన్న పని ద్వారా భారీగా నష్టపోయారు. కేవలం తాను చేసిన ఒక్క ట్వీట్ ద్వారా ఒక్కరోజులోనే భారత కరెన్సీలో లక్ష కోట్లకు పైగా విలువను ఎలాన్ మస్క్ కోల్పోవాల్సి వచ్చింది.
ప్రపంచ కుబేరుడిగా అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌తో పోటీ పడుతున్న మరో వ్యాపారం దిగ్గజం ఎవరంటే ఎలాన్ మస్క్(Elon Musk) అని చెప్పవచ్చు. విద్యుత్ కార్లు టెస్లా కంపెనీ అధినేత ఇటీవల బెంగళూరు కేంద్రంగా తన కంపెనీ తొలి విభాగాన్ని సైతం ఏర్పాటు చేశారు. గత వారం బిట్‌కాయిన్‌పై చేసిన ట్వీట్ ఆయనకు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీలపై సాధారణంగా స్పందించడం ఎలాన్ మస్క్‌కు అలవాటు.
Also Read: SBI: ఒక్క SMS ద్వారా రూ.14 లక్షల వరకు Pension Loan పొందవచ్చు, ఇది చదవండి
ఈ క్రమంలో బిట్‌కాయిన్, ఎథర్ క్రిప్టోకరెన్సీ ధర ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తోందంటూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు. దీంతో అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్లో మస్క్‌కు చెందిన టెస్లా(Tesla Company) కార్ల షేరు విలువ ఒక్కసారిగా 8.6 శాతం తగ్గింది. గత ఆరు నెలలో టెస్లా షేరు విలువ ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. తద్వారా ఒక్కరోజు 15 బిలియన్ అమెరికా డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.1.09 లక్షల కోట్లు) నష్టపోయారు.
Also Read: EPFO: 4 విధాలుగా మీ ఖాతాల్లోని PF Balanceను సులువుగా చెక్ చేసుకోవచ్చు
రెగ్యూలర్ కరెన్సీకి బదులుగా బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీ లాంటి వాటిని వినియోగించాలని ఎలాన్ మస్క్ భావిస్తారు. ఈ ఆలోచనల నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఇటీవల 15 బిలియన్ డాలర్ల విలువ గల బిట్కాయిన్లు కొనుగోలు చేశారు. దీంతో ఒక్కసారిగా క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్ల విలువ అమాంతం పెరిగిపోయింది. తాజాగా నష్టపోయిన అనంతరం ఎలాన్ మస్క్ సంపద 183 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం.
Also Read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు Supreme Court శుభవార్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook