Facebook fined Rs 520 crore by UK regulator for violating order in Giphy acquisition: ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఫేస్‌బుక్‌కు బ్రిటన్ కాంపీటీషన్ రెగ్యులేటర్ (Britain's competition regulator) భారీగా జరిమానా విధించింది. తాము అడిగిన వివరాలు సమర్పించడంలో ఫేస్‌బుక్ (Facebook) నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడంతో రూ.520 కోట్ల (520 crore) జరిమానా విధిస్తున్నామంటూ బ్రిటన్ కాంపీటీషన్ రెగ్యులేటర్ తెలిపింది. అలాగే ఏ కంపెనీ అయినా చట్టానికి లోబడి ఉండాల్సిందేనన్న హెచ్చరిక పంపించాలన్న విధానాల మేరకు ఈ జరిమానా విధించినట్లు పేర్కొంది.
Also Read : Tirumala online darshan tickets : తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
యూనిమేటెడ్ సంస్థ జిఫీని (Giphy) గతేడాది ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. అయితే, జిఫీ కొనుగోలు ద్వారా సోషల్ మీడియా మధ్య పోటీని ఫేస్‌బుక్ నియంత్రిస్తోందన్న ఆరోపణలపై బ్రిటన్ కాంపీటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (సీఎంఏ) (CMA) విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో వివరాలు ఇవ్వాలని పలుమార్లు కోరింది. అయితే వాటిని సమర్పించడంలో ఫేస్‌బుక్ (Facebook) ఉద్దేశపూర్వకంగానే వెనుకడుగు వేసిందని సీఎంఏ పేర్కొంది.ఇక సీఎంఏ నిర్ణయంపై ఫేస్‌బుక్ (Facebook) స్పందించింది. ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. సీఎంఏ నిర్ణయంపై సమీక్షించి తదుపరి అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది.
Also Read : TDP Leader Pattabhi Arrested : టీడీపీ నేత పట్టాభిని అరెస్టు చేసిన పోలీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి