ఆండ్రాయిడ్ 9.0 ను లాంఛ్ చేసిన గూగుల్

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)లో తాజా వెర్షన్ '9.0పై(Pie)' ను గూగుల్ లాంఛ్ చేసింది.

Updated: Aug 7, 2018, 11:16 AM IST
ఆండ్రాయిడ్ 9.0 ను లాంఛ్ చేసిన గూగుల్

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)లో తాజా వెర్షన్ '9.0పై(Pie)' ను గూగుల్ లాంఛ్ చేసింది.

ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌తో కూడిన బ్యాటరీ సిస్టంతో పాటు నావిగేషన్ సిస్టంలను ఒకే హోమ్ బటన్ ద్వారా పొందే సదుపాయాన్ని ఈ వెర్షన్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త వెర్షన్‌‌తో ఎన్నో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఓఎస్.. బ్యాటరీ లైఫ్ పెంచడమే కాక వినియోగదారులు ఫోన్‌ను అతిగా వాడకుండా ఉండేలా, నిద్రకు ఆటంకం రాకుండా చూసుకునేలా సహకరిస్తుందని గూగుల్ చెబుతోంది. యాప్స్‌ వినియోగాన్ని ట్రాక్ చేసేలా కొత్త పద్ధతులను ఈ సాఫ్ట్‌వేర్ తీసుకొచ్చింది. కాగా ప్రస్తుతం గూగుల్ పిక్సల్ ఫోన్లలో ప్రవేశపెట్టిన ఈ వెర్షన్.. ఈ ఏడాది చివరికి అన్ని ఫోన్లలో అందుబాటులోకి రానున్నట్లు గూగుల్ తెలిపింది.

గూగుల్ తన ఆండ్రాయిడ్ ఓఎస్‌లకు ఎప్పుడు స్వీట్స్ పేర్లు పెట్టడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే 'ఫై' అనే పేరును పెట్టింది. ఇందులో వినియోగదారుడు ఫోన్‌ను ఎంతసేపు వినియోగించారో తెలుస్తుంది. బాగా ఎక్కువగా వాడే యాప్స్‌ను ఎంతసేపు వినియోగించారన్నది నిమిషాల సహా లెక్క చూపిస్తుంది.

మీరు ఒకవేళ యాప్స్ వినియోగాన్ని తగ్గించుకోవాలంటే మ్యాగ్జిమమ్ లిమిట్ పెట్టుకోవచ్చు. టైం లిమిట్ దాటాక.. తొలుత హెచ్చరిక వచ్చి.. ఆతర్వాత యాప్‌ ఐకాన్ రంగు మారి యాప్ పనిచేయడం ఆగిపోతుంది. రాత్రుళ్లు ఫోన్ 'డు నాట్ డిస్ట్రబ్' మోడ్‌లో పెట్టుకొని హాయిగా నిద్రపోయే అవకాశం ఈ కొత్త ఓఎస్‌లో ఉంది.