Plane crash: కొంప ముంచిన ఆ తప్పిదం.. దేశ ఉపాధ్యక్షుడి తో పాటు 10 దుర్మరణం..

saulos chilima died: ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న సైనిక విమానం నిన్నటి నుంచి ఎయిర్ సిగ్నల్ కు దూరమైంది. ఈ క్రమంలో విమాన శకాలాలను అధికారులు పర్వతశ్రేణుల్లో కనుగొన్నారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Jun 11, 2024, 07:08 PM IST
  • ఘోర విమానం ప్రమాదం..
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పలుదేశాలు..
Plane crash: కొంప ముంచిన ఆ తప్పిదం..  దేశ ఉపాధ్యక్షుడి తో పాటు 10 దుర్మరణం..

Malawi vice prisident died in plane crash: ఆఫ్రికాదేశమైన మలావీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆదేశ ఉపాధ్యక్షుడు  సౌలస్ షిలిమాతో పాటు మరో 9 మంది సైనిక విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ఆ విమానం గల్లంతయ్యింది. దీనిపై అధికారులు వెంటనే, రంగంలోకి దిగి వెతుకులాట ప్రారంభించారు. డ్రోన్లు, హెలికాప్టర్ లతో సెర్చ్ నిర్వహించారు. అదేవిధంగా అమెరికా, బ్రిటన్, నార్వే వంటి పలు దేశాలు కూడా సహాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే .. విమాన శకలాలను గుర్తించినట్లు అధికారులు గుర్తించారు. 

Add Zee News as a Preferred Source

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

విమానంమంతా తునాతునకలైనట్లు అధికారులు గుర్తించారు. హెలికాప్టర్ లో ఉన్న వారంతా చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమాతో పాటు.. అందులో ప్రయాణిస్తున్న మరో 9 మంది కూడా దుర్మరణం చెందినట్లు.. ఆ దేశ అధ్యక్షుడు  లాజరస్ చక్వేరా వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మలావీ రాజధాని లిలోంగ్వే నుంచి బయలు దేరిన ఆ విమానం 370 కిలో మీటర్లు దూరంలో ఉన్న జుజు ఇంటర్నేషనల్ విమానశ్రయంలో దిగాల్సి ఉంది. 

Read more; Us man forceful sneeze: బాప్ రే.. గట్టిగా తుమ్మగానే.. పొట్ట చీల్చుకుని బైటపడ్డ పేగులు.. ఎక్కడో తెలుసా..?..

కానీ వాతావరణం అనుకూలంగా లేదంటూ ఏవియేషన్ అధికారులు సూచించారు. అక్కడకు వెళ్లోద్దని, తిరిగి లిలోంగ్వేకు వెళ్లిపోవాలని ఏడీసీ సూచించింది. అయిన కూడా విమానయాన సిబ్బంది పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే కాసేపటికే ఉపాధ్యక్షుడు  ప్రయాణిస్తున్న విమానం నుంచి ఏవియేషన్ అధికారులకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ దారుణ ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. 
 

ఇదిలా ఉండగా.. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆ దేశ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దొల్లహియన్ చనిపోయిన విషయం తెలిసిందే. తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతుండటంతో, విమానంలో ప్రయాణించేందుకు కొందరు ప్రముఖులు ఆందోళన వ్యక్తంచేస్తున్నట్లు తెలుస్తోంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News