Michelle Obama: ట్రంప్ ఓ అస‌మ‌ర్థ ప్రెసిడెంట్

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ( Barack Obama ) సతీమణి మాజీ ఫస్ట్ లేడీ మిచెల్ ఒబామా ( Michelle Obama ).. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ఘాటు విమర్శలు చేశారు.

Last Updated : Aug 18, 2020, 08:41 PM IST
    1. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మాజీ ఫస్ట్ లేడీ మిచెల్ ఒబామా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ఘాటు విమర్శలు చేశారు.
    2. ట్రంప్ లో సానుభూతి లేదు అని.. విభజన రాగం వినిపిస్తారు అని.. ఆందోళనకు ఆజ్యం పోస్తారు అని విమర్శించారు మిచెల్. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా సరిపోరు అని అన్నారు.
Michelle Obama: ట్రంప్ ఓ అస‌మ‌ర్థ ప్రెసిడెంట్

అమెరికా ( America ) ఎన్నికల దగ్గరు పడుతున్న వేళ రాజకీయ వ్యాఖ్యాలు పెరుగుతున్నాయి. ఎవరికి వారు ఎదురుదాడి చేయడానికి వెనకాడటం లేదు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ( Barack Obama ) సతీమణి మాజీ ఫస్ట్ లేడీ మిచెల్ ఒబామా ( Michelle Obama ).. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ఘాటు విమర్శలు చేశారు. అధ్యక్షుడిగా ట్రంప్ అసమర్థుడు అని విమర్శించారు మిచెల్. డోనాల్డ్ ట్రంప్ లో సానుభూతి అనేది లేదని ఎండగట్టారు.

డెమోక్రటిక్ పార్టీ మీట్ లో పాల్గొన్న మిచెల్ ఒబామా ..డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) నాయకత్వాన్ని నిలదీశారు. అమెరికా ప్రజలు సమర్థవంతమైన నాయకుడి కోసం, ఓర్పు ఉన్న వ్యక్తి, స్థిరమైన వ్యక్తిత్వం కోసం వైట్ హౌజ్ వైపు చూస్తే వారికి శూన్యం మాత్రమే కనిపిస్తోంది అని అన్నారు. ట్రంప్ లో సానుభూతి లేదు అని.. విభజన రాగం వినిపిస్తారు అని.. ఆందోళనకు ఆజ్యం పోస్తారు అని విమర్శించారు మిచెల్. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా సరిపోరు అని అన్నారు.

Trending News