న్యూయార్స్: ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ అంతరిక్షయాత్రకు నాసా సిద్ధమైంది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రైవేటు స్పేస్ కంపెనీలు స్పేస్ ఎక్స్, బోయింగ్‌లు అభివృద్ధి చేసిన స్టార్ లైనర్, డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా 2019 జనవరిలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను పంపుతామని నాసా తెలిపింది. అంతరిక్షయాత్రకు వెళ్లే 9 మంది వ్యోమగాముల జాబితాను ప్రకటించింది. వీరిలో భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ పేరు కూడా ఉండడం గమనార్హం.
వాస్తవానికి 1972లో ప్రారంభించిన స్పేస్ షటిల్ ప్రాజెక్టు 2011లో ముగిసిపోవడంతోనే అమెరికా భూభాగం నుంచి నాసా అంతరిక్షయాత్ర చేపట్టలేకకోయింది. తాజాగా బోయింగ్, స్పేస్ ఎక్స్ సంస్థల సహకారంతో కొత్త తరం అంతరిక్ష నౌకల్ని అభివృద్ధి చేసి ఈ ప్రయోగానికి సిద్ధమైంది నాసా.