Covid-19 In USA: కరోనావల్ల అమెరికాలో 2.50 లక్షల మంది మరణం

Corona Deaths in America : కరోనావైరస్ తొలి కేసు అధికారికంగా నమోదు అయి ఒక సంవత్సరం అయింది. ఈ కాలంలో అనేక దేశాలను అది పూర్తిగా తన వశంలోకి తీసుకుంది. చాలా దేశాల్లో లక్షలాది మంది దాని వల్ల ప్రభావితం అయ్యారు. అందులో అత్యధికంగా ప్రభావితం అయిన దేశాల్లో అమెరికా టాప్ లో ఉంది. 

Last Updated : Nov 20, 2020, 06:10 PM IST
    1. కరోనావైరస్ తొలి కేసు అధికారికంగా నమోదు అయి ఒక సంవత్సరం అయింది.
    2. ఈ కాలంలో అనేక దేశాలను అది పూర్తిగా తన వశంలోకి తీసుకుంది.
    3. చాలా దేశాల్లో లక్షలాది మంది దాని వల్ల ప్రభావితం అయ్యారు.
    4. అందులో అత్యధికంగా ప్రభావితం అయిన దేశాల్లో అమెరికా టాప్ లో ఉంది.
Covid-19 In USA: కరోనావల్ల అమెరికాలో 2.50 లక్షల మంది మరణం

Covid-19 Deaths in America | కరోనావైరస్ తొలి కేసు అధికారికంగా నమోదు అయి ఒక సంవత్సరం అయింది. ఈ కాలంలో అనేక దేశాలను అది పూర్తిగా తన వశంలోకి తీసుకుంది. చాలా దేశాల్లో లక్షలాది మంది దాని వల్ల ప్రభావితం అయ్యారు. అందులో అత్యధికంగా ప్రభావితం అయిన దేశాల్లో అమెరికా టాప్ లో ఉంది. 

Also Read | Fact Check: కరోనా టీకా వచ్చిసిందా ? వాట్సాప్ మెసేజ్ లో నిజమెంత? 

తొలూత అమెరికాలో ( America) కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయితే చాలా తక్కువ కాలంలో అది అన్ని దేశాలను దాటేసింది. తాజాగా అ దేశంలో కరోనావల్ల మరణించిన వారి సంఖ్య రెండున్నర లక్షలను దాటేసింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

అమెరికాలో ఇప్పటి వరకు నమోదు అయిన కోవిడ్-19 ( Covid-19) కేసుల సంఖ్య 1,15,17,455 గా ఉంది. సగటున అక్కడ ప్రతీ రోజు లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది మరణిస్తున్నారు. దాంతో పాటు ప్రస్తుతం చలికాలం కావడంతో కోవిడ్-19 సంక్రమించే అవకాశం రెట్టింపు అయింది. 

Also Read | Women Empowerment : మహిళల కోసం ప్రత్యేక సేవింగ్ ఎకౌంట్, వడ్డీ ఎంతో తెలుసా?

దీన్ని గమనించిన అమెరికా ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టింది. స్కూళ్లు కాలేజీలు మూసివేశారు. బార్లు రెస్టారెంట్లపై ఆంక్షలు పెంచారు. అమెరికా తరువాత అత్యధికంగా కరోనా వైరస్ ( Coronavirus) వల్ల మరణాల సంఖ్య విషయంలో దేశాల్లో బ్రెజిల్, భారత్, మెక్సికోలు టాప్ లో ఉన్నాయి.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News