ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య 9లక్షలు దాటిపోయింది. పలు దేశాలు వారాలు, నెలలపాటు లాక్డౌన్ విధించాయి. కొన్ని దేశాలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అలా కాని పక్షంలో పెయిడ్ లీవ్స్ ఇచ్చాయి. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను అతిక్రమించిన వారిని నిర్ధాక్షిణ్యంగా కాల్చిపారేయాలని ఆదేశాలు వచ్చాయి.
ఈ ఆదేశాలు జారీ చేసింది మరెవరో కాదు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టె. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే డ్యుటర్టే తాజాగా కరోనా లాక్డౌన్ ఉల్లంఘనులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ‘దేశ ప్రజలకు ఇదే నా హెచ్చరిక. ప్రస్తుతం కష్టకాలం నడుస్తోంది. కనుక ఫిలిప్పీన్స్ ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటించండి. ఎవరైనా కరోనా లాక్డౌన్లో భాగం జారీ చేసిన ఆదేశాలను ఉల్లఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఇతరుల ప్రాణాలను సైతం రిస్క్‌లో పెట్టేవారిని కాల్చిపారేయాలని పోలీసులు, మిలిటరీని ఆదేశించానని’ స్పష్టం చేశారు. గంభీర్, యువీ పోరాటం.. ధోనీ ఫినిషింగ్.. అద్భుతమైన క్షణాలు
మనీలాలోని ఓ ప్రాంతంలో ప్రభుత్వం నుంచి సరైన సాయం అందలేదంటూ ప్రజలు రోడ్లమీదకు రావడంపై మీడియా అధ్యక్షుడు డ్యూటర్టెను సంప్రదించింది. హాస్పిటల్ సిబ్బందికి సహకరించకపోవడం, వారిపై దాడులకు పాల్పడటం చేసినా, ఇతరుల ప్రాణాలకు హాని తలెత్తే పని చేసే వారిని చచ్చేవారకు కాల్చి పారేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సెక్సీ ఫిగర్‌తో సెగలు రేపుతోన్న భామ
నేషనల్ పోలీస్ బాస్ దీనిపై స్పందించారు. కరోనా తీవ్రతరాన్ని ప్రజలకు తెలియజేసేందుకు అధ్యక్షుడు అలాంటి వ్యాఖ్యలు చేశారు కానీ నిజంగా కల్చి చంపేయాలనుకోవడం డ్యూటర్టె ఉద్దేశం కాదని అభిప్రాయపడ్డారు. కాగా, కరోనా మహమ్మారి బారిన పడి ఫిలప్పీన్స్‌లో దాదాపు 100 మంది చనిపోయారు. మరో 2311 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. వెండి పరుగులు జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ