Ukraine crisis: కొన్ని రోజుల క్రితం ప్రకృతితో అలరారిన ప్రదేశాలు..నేడు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. చారిత్రక కట్టడాలు..శిథిలమయ్యాయి. పెద్ద పెద్ద భవంతులు బాంబులకు బలయ్యాయి. వీధుల్లో ఎటు చూసినా శవాల గుట్టలే దర్శనమిస్తున్నాయి. ఎంతోమంది అనాథలు అయ్యారు. ఇంకెంత మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రష్యా దాడులతో (Russia-Ukraine war) ఉక్రెయిన్ లో ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన భావోద్వేగ వీడియో ఎంతో మంది చేత కన్నీరు పెట్టిస్తోంది.
ఈ వీడియోలో రష్యా దాడులకు ముందు ఎంత అందంగా ఉందో..ఇప్పుడు ఎంతటి భయానకంగా ఉందో ఈ వీడియో అద్ధం పడుతోంది. బాంబు దాడుల్లో ధ్వంసమైన భవనాలు, మరియుపోల్ ప్రసూతి ఆసుపత్రి వద్ద మిన్నంటిన రోగుల ఆర్తనాదాలు, తల్లిదండ్రులను విడిచి పరాయి దేశాలకు వలస వెళ్తోన్న పిల్లలు... ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వందల మంది పౌరుల సామూహిక ఖననాల వంటి హృదయ విదారక దృశ్యాలు ఎంతోమంది హృదయాలను కలిచివేస్తున్నాయి. బుధవారం అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు జెలెన్‌స్కీ (ukraine president zelensky). ఈ వీడియోను అక్కడి ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. ఇప్పటికైనా తమ దేశంపై నో ఫ్లై జోన్ ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read: ICJ On Russia: రష్యాకు అంతర్జాతీయ న్యాయ స్థానంలో ఎదురుదెబ్బ.. యుద్ధం ఆపాలంటూ ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook