Ukraine crisis: 'రష్యా యుద్ధానికి ముగింపు పలికేలా మోదీ చొరవ తీసుకోవాలి'.. భారత్​కు మరోసారి ఉక్రెయిన్ విజ్ఞప్తి

Russia-Ukraine war: రష్యా యుద్ధ నేపథ్యంలో మరోసారి భారత్ మద్దతు కోరింది ఉక్రెయిన్. తమ దేశంపై చేస్తున్న దాడులకు పుతిన్ సర్కారు ముగింపు పలికేలా భారత్​ చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2022, 10:21 AM IST
  • రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం
  • ఉక్రెయిన్ పై భీకరంగా విరుచుకుపడుతున్న రష్యా
  • చొరవ తీసుకోవాలని ప్రధాని మోదీకి ఉక్రెయిన్ విజ్ఞప్తి
Ukraine crisis: 'రష్యా యుద్ధానికి ముగింపు పలికేలా మోదీ చొరవ తీసుకోవాలి'.. భారత్​కు మరోసారి ఉక్రెయిన్ విజ్ఞప్తి

Russia-Ukraine Crisis: ఉక్రెయిన్​పై రష్యా భీకర దాడులతో (Russia-Ukraine war)విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి భారత్ మద్దతు కోరారు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా (Dmytro Kuleba). తమ దేశంపై చేస్తున్న దాడులను ఆపమని పుతిన్‌ను నరేంద్రమోదీ కోరాలని ఆయన విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం (మార్చి 5, 2022) ప్రకటన విడుదల చేశారు. ఈ యుద్ధాన్ని ఆపివేయాలని రష్యా మిత్రదేశాలన్నీ  పుతిన్ (Vladimir Putin)కు విజ్ఞప్తి చేయాలని ఆయన కోరారు. 

రష్యాతో భారత్​కు (India) సుదీర్ఘంగా ప్రత్యేక అనుబంధం ఉంది.  ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి ప్రధాని మోదీ (PM Modi), రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు రెండుసార్లు మాట్లాడుకున్నారు. ఫిబ్రవరి 24న తన మొదటి సంభాషణ సందర్భంగా హింసను ఆపి, దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా భారతీయుల భద్రతే ప్రధానాంశంగా వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. 

''ఉక్రెయిన్​ వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా ఒకటి. ఈ యుద్ధం ఇలా కొనసాగితే పంటలు పండించలేం. ఇది అంతర్జాతీయంగా కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ యద్ధాన్ని ఆపడం ఉత్తమం'' అని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి చెప్పారు. ఉక్రెయిన్ నుంచి ఎక్కువగా సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది భారత్. 

Also Read: Russia Ukraine War: యుద్దానికి తాత్కాలిక విరామం.. కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News