USA: అమెరికాలో దారుణం..న్యూ ఓర్లిన్స్ జనాలపైకి దూసుకెళ్లిన కారు..12 మంది దుర్మరణం

USA terror attack: అమెరికాలో దారుణం జరిగింది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నవారిపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. మరో 30 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన న్యూ ఓర్లీన్స్ లోని కెనాల్, బోర్బన్ స్ట్రీట్ ల్  చోటుచేసుకుంది.

Written by - Bhoomi | Last Updated : Jan 1, 2025, 08:41 PM IST
USA: అమెరికాలో దారుణం..న్యూ ఓర్లిన్స్ జనాలపైకి దూసుకెళ్లిన కారు..12 మంది దుర్మరణం

USA: అమెరికాలోని న్యూ ఓర్లీన్స్ కెనాల్, బోర్బన్ స్ట్రీట్‌లో బుధవారం దారుణం జరిగింది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న జనాలపైకి కారు దూసుకెళ్లడంతో 12 మంది మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 3.15 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఎస్ యూవీ కారు సంబురాల్లో మునిగి ఉన్న వ్యక్తులపై బలంగా దూసుకువచ్చింది. ఈ ఘటనలో ఏకంగా 12 మంది మరణించారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే..ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదు. 

ఓ వ్యక్తి కావాలనే న్యూ ఇయర్ వేడుకల్లో ఉన్న ప్రజల మీదకు కారును వేగంగా తీసుకెళ్లాడు. తర్వాత డ్రైవర్ కారు కిందకు దిగి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 12 మంది మరణించారు. 30 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఇది తీవ్రవాద ఘటనగా పోలీసులు భావిస్తున్నారు. సమీప ప్రాంతంలో పేలుడు పదార్థాలు లభించినట్లు తెలుస్తోంది. కాగా న్యూ ఓర్లిన్స్ మేయర్ ఈ ఘటనను తీవ్రవాద చర్య అంటూ అభివర్ణించారు. 

క్షతగాత్రులను ఐదు స్థానిక ఆస్పత్రుల్లో చేర్పించారు. ఈ సంఘటన న్యూ ఓర్లీన్స్‌లో నూతన సంవత్సర వేడుకల ముగింపులో నగరంలోని సీజర్స్ సూపర్‌డోమ్‌లో జరిగిన కాలేజ్ ఫుట్‌బాల్ క్వార్టర్‌ఫైనల్ ఆల్‌స్టేట్ బౌల్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు జరిగింది. వేలాది మంది హాజరయ్యే అవకాశం ఉంది.

Also Read: EPFO: పెన్షన్ దారులకు గుడ్‌న్యూస్..ఇక నుంచి దేశంలో ఎక్కడైనా, ఏ బ్యాంకు నుంచైనా పింఛన్ తీసుకోవచ్చు.    

 

10 people were killed and 30 injured after a vehicle drove into a crowd on New Orlean's Canal and Bourbon Street, reports AP. pic.twitter.com/YFDdSL9qO5

న్యూ ఓర్లీన్స్ మేయర్ మాట్లాడుతూ న్యూ ఇయర్ రోజున ఒక కారు జనంపైకి దూసుకెళ్లి, భారీ ప్రాణనష్టానికి కారణమైన సంఘటన 'ఉగ్రవాద దాడి' అని అన్నారు. వేగంగా వచ్చిన ఓ వాహనం జనాలపైకి దూసుకెళ్లిందని ఘటనా స్థలంలో ఉన్నవారు తెలిపారు. ఈ దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లు తెలుస్తోంది. న్యూ ఓర్లీన్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాట్లాడుతూ, ఒక వాహనం వ్యక్తుల సమూహాన్ని ఢీకొట్టినట్లు ప్రాథమిక నివేదికలు కనిపిస్తున్నాయి. అయితే ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎంత అన్నది సరిగ్గా అంచనా వేయలేదు.

Also Read: Gold Rate Today: కొత్త సంవత్సరం వేళ..తగ్గిన బంగారం ధర..ఎంత తగ్గిందో తెలిస్తే కొనేస్తారు  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

Trending News