న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు వేగంగా విస్తరిస్తోంది. కాసేపటిక్రితం బ్రిటన్ ప్రధాని బోరిస్ జోన్సన్ కు కరోనా సోకినట్టు నిర్ధారణయ్యిందని బ్రిటన్ అధికార వర్గాలు తెలిపాయి. గత 24 గంటలుగా బోరిస్ జాన్సన్ స్వల్పంగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నట్టు గుర్తించారు. కాగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ సూచనల మేరకు ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా, పరీక్ష ఫలితాల్లో పాజిటివ్ అని వచ్చింది. 55 ఏళ్ల బోరిస్ జాన్సన్ ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నారని, కరోనా నేపథ్యంలో ఇంటి నుంచే దేశవ్యాప్తంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, తాను కూడా కరోనా బారినపడ్డానని, అయితే, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఇంటినుంచే వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని తెలిపారు. సాహో ప్రభాస్.. కరోనాపై పోరాటానికి భారీ విరాళం
Also Read: కడుపుబ్బా నవ్వించే కరోనా మీమ్స్
మరోవైపు కరోనా వైరస్ జన్మించిన చైనాలో మూడు రోజుల తరువాత ఓ కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. ఇదే సమయంలో వివిధ దేశాల నుంచి చైనాకు వచ్చిన 54 మందికి వైరస్ సోకినట్టు వెలుగులోకి రావడంతో, చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో అంతర్జాతీయ విమానాల సంఖ్యను కుదించింది. తమ దేశంలో వైరస్ వ్యాప్తి తగ్గినా, విదేశాల నుంచి వచ్చే వారితో తిరిగి కేసులు పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తం చేసిన అధికారులు, మరోసారి చైనా ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని అమలు చేస్తున్నారు.
తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..