Plasma Therapy: ఎట్టకేలకు అమెరికాలో ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్

అగ్రరాజ్యం అమెరికాలో సైతం కరోనా చికిత్స (Plasma Therapy In US)లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా పేషెంట్లకు ప్లాస్మా చికిత్స అందించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది.

Last Updated : Aug 24, 2020, 09:17 AM IST
  • అమెరికాలో కరోనా చికిత్సలో భాగంగా కీలక నిర్ణయం
  • కరోనా బాధితులకు ప్లాస్మా థెరపీ చేసేందుకు అనుమతి
  • ప్లాస్మా దానం చేయాలని పిలుపునిచ్చిన డొనాల్డ్ ట్రంప్
Plasma Therapy: ఎట్టకేలకు అమెరికాలో ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్

ఎట్టకేలకు అమెరికాలో సైతం కరోనా చికిత్స (Plasma Therapy In US)లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా పేషెంట్లకు ప్లాస్మా చికిత్స అందించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది. పలు ప్రపంచ దేశాలు ప్లాస్మా థెరపీతో ఫలితాలు రాబడుతున్న వేళ అమెరికా సైతం ఈ చికిత్స వైపు మొగ్గు చూపింది. కోవిడ్19 పాజిటివ్‌గా తేలిన పేషెంట్లకు హాస్పిటల్‌లో చేరిన మూడు, నాలుగు రోజుల తర్వాత ప్లాస్మా థెరపీ చేయనున్నారు. సీరో సర్వేలో కరోనాపై షాకింగ్ విషయాలు వెల్లడి 
 Weight Loss Tips: బొజ్జ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

ప్లాస్మా థెరపీ అనుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మాట్లాడుతూ.. ‘చైనా వైరస్ (CoronaVirus)కు వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నాం. ప్లాస్మా థెరపీకి ఎఫ్‌డీఏ అనుమతినివ్వడం చాలా సంతోషదాయకం. అత్యవసరమైన పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ఇక నుంచి అమెరికాలో అందుబాటులోకి రానుందని’ వెల్లడించారు. Gold Price: నేటి మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు

ప్లాస్మా థెరపీపై అధ్యయనం కోసం అమెరికా 48 మిలియన్ డాలర్లు వెచ్చిస్తోందన్నారు. ప్లాస్లా థెరపీ చికిత్సతో మరణాల రేటు 35శాతాన్ని పలు దేశాలు తగ్గించాయని ట్రంప్ గుర్తుచేశారు. కోవిడ్19 నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి 
 
Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్ 
JEE మెయిన్స్, NEET హాల్ ‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Trending News