Chicago Shootings : చికాగోలో వరుస కాల్పుల ఘటనలు.. ఈ వీకెండ్‌లో ఐదుగురు మృతి, 19 మందికి గాయాలు..

Chicago Shooting Incident: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. చికాగోలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో ఇద్దరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 13, 2022, 07:00 AM IST
  • అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
  • చికాగోలో వరుస కాల్పుల ఘటనలు
  • ఈ వీకెండ్‌లో వేర్వేరు కాల్పుల్లో ఐదుగురు మృతి
Chicago Shootings : చికాగోలో వరుస కాల్పుల ఘటనలు.. ఈ వీకెండ్‌లో ఐదుగురు మృతి, 19 మందికి గాయాలు..

Chicago Shooting Incident: అమెరికాలో మరోసారి కాల్పుల ఉదంతం చోటు చేసుకుంది. చికాగోలోని ఓ నైట్ క్లబ్‌లో చోటు చేసుకున్న కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం (జూన్ 12) అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులకు పాల్పడింది ఎవరు.. ఎందుకు.. అనే విషయాలపై స్పష్టత లేదు. 

కాల్పుల ఘటనపై స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. చికాగోలోని గేరీ ప్రాంతంలో ఉన్న నైట్ క్లబ్‌లో కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలిపారు. కాల్పుల్లో 34 ఏళ్ల ఓ యువకుడు, 26 ఏళ్ల ఓ యువతి మృతి చెందినట్లు తెలిపారు. నైట్ క్లబ్ ఎంట్రన్స్ వద్ద యువకుడి మృతదేహాన్ని, క్లబ్ లోపల యువతి మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు. ఆ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు. 

మృతుల పేర్లు, వివరాలు పోలీసులు ఇంకా వెల్లడించలేదు. కాల్పుల్లో గాయపడినవారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెట్రో హోమిసైడ్ యూనిట్ ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. కాల్పుల ఉదంతానికి సంబంధించి ఎవరికైనా ఏదైనా సమాచారం తెలిసినట్లయితే క్రైమ్ టిప్ లైన్‌కి చేరవేయాలని కోరింది.

కాగా, చికాగోలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ వారాంతంలో చోటు చేసుకున్న వేర్వేరు కాల్పుల ఘటనల్లో మొత్తం ఐదుగురు మృతి చెందగా, 19 మంది వరకు గాయపడ్డారు. శుక్ర, శని, ఆదివారాల్లో చికాగోలోని వేర్వేరు ప్రాంతాల్లో వరుస కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. 

Also Read: Horoscope Today June 13th : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఇవాళ అనుకోని వ్యక్తి నుంచి సాయం..

Also Read: India vs SA T20: టీమ్ ఇండియాపై 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News