Tanzania Plane Crash: విక్టోరియా సరస్సులో విమానం కూలి 19 మంది దుర్మరణం

Plane Crash in Tanzania: టాంజానియాలోని విక్టోరియా సరస్సులో విమానం కుప్పకూలి... 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 43 మంది ఉన్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2022, 06:23 AM IST
Tanzania Plane Crash: విక్టోరియా సరస్సులో విమానం కూలి 19 మంది దుర్మరణం

Plane Crash in Tanzania: టాంజానియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్థిక రాజధాని దార్ ఎస్ సలామ్ నుండి బయలుదేరిన ప్రెసిషన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం విక్టోరియా సరస్సులో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ఉన్నారు. వీరిలో 26 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. విమానం బుకోబా విమానాశ్రయంలో ల్యాండ్ అవాల్సి ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల విమానం కుప్పకూలినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. 

కెన్యా ఎయిర్‌వేస్ యాజమాన్యంలో ఉన్న ప్రెసిషన్ ఎయిర్ సంస్థను 1993లో స్థాపించారు. ఇది దేశీయంగా విమానాలను నడుపుతుంది. అలాగే సెరెంగేటి నేషనల్ పార్క్ మరియు జాంజిబార్ వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు ప్రైవేట్ చార్టర్‌లను నిర్వహిస్తోంది.

గతంలో...
గతంలో ఉత్తర టాంజానియాలో సఫారీ కంపెనీ కోస్టల్ ఏవియేషన్‌కు చెందిన విమానం కూలి 11 మంది దుర్మరణం చెందారు. మార్చి 2019లో అడిస్ అబాబా నుండి నైరోబీకి వెళ్లే ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అయిన ఆరు నిమిషాల తర్వాత ఇథియోపియన్ రాజధానికి ఆగ్నేయ ప్రాంతంలో కుప్పకూలి 157 మంది మరణించారు. 2007లో కెన్యా ఎయిర్‌వేస్ విమానం ఐవరీ కోస్ట్ నగరం అబిజాన్ నుండి కెన్యా రాజధాని నైరోబీకి వస్తున్న సమయంలో కుప్పకూలి 114 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. 

2000లో అబిజాన్ నుండి నైరోబికి వెళ్లే మరో కెన్యా ఎయిర్‌వేస్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలలే అట్లాంటిక్ మహాసముద్రంలో కూలి 169 మంది మరణించగా, 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఏడాది కిందట ఉత్తర టాంజానియాలో జరిగిన విమాన ప్రమాదంలో 10 మంది యూస్  పర్యాటకులతో సహా ఒక డజను మంది మరణించారు.

Also Read: Tika Dutta Pokharel: ఎన్నికల బరిలో వందేళ్ల వృద్ధుడు.. మాజీ ప్రధానిపై పోటీకి సై 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News