గణిత శాస్త్రంలో భారత సంతతి వ్యక్తికి వరించిన నోబెల్ బహుమతి

స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఇండో-ఆస్ట్రేలియన్ గణిత శాస్త్రవేత్త అక్షయ్ వెంకటేష్ (36)కు నోబెల్ బహుమతి వరించింది.

Updated: Aug 2, 2018, 02:26 PM IST
గణిత శాస్త్రంలో భారత సంతతి వ్యక్తికి వరించిన నోబెల్ బహుమతి

స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఇండో-ఆస్ట్రేలియన్ గణిత శాస్త్రవేత్త అక్షయ్ వెంకటేష్(36)కు నోబెల్ బహుమతి వరించింది. గణిత శాస్త్రంలో ఆయనకు ప్రతిష్టాత్మక 'ఫీల్డ్స్ పతకం' దక్కింది.  ఫీల్డ్స్ పతాకాన్ని 'నోబుల్ ఫర్ మాథ్స్' అని కూడా పిలుస్తారు. ఈ పతకాలను ప్రతి నాలుగేళ్లకొకసారి ఇస్తారు. 40 సంవత్సరాల వయస్సులోపు ఉన్న గణిత శాస్తవేత్తలకు ఈ ఫీల్డ్ పతకాలను అందజేస్తారు. గణిత శాస్త్రంలో అక్షయ్ వివిధ రచనలు చేశారు.

అక్షయ్‌తో సహా కుర్దిష్‌ నుంచి శరణార్థిగా ఇంగ్లాండుకు వచ్చిన కౌచర్ బిర్కర్(కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్), జర్మనీకి చెందిన పీటర్ స్క్లోజ్ (బోన్ యూనివర్సిటీ అధ్యాపకుడు), జ్యూరిచ్‌లోని ఇటిహెచ్‌లో పని చేస్తున్న ఇటలీకి చెందిన గణితశాస్త్రవేత్త అలెస్సియో ఫిగాలిలకు నోబెల్ వరించింది. వీరికి బ్రెజిల్‌లోని లియోడీ జని యారోలో నిర్వాహకులు ఫీల్డ్స్ పతకాలను అందజేశారు. మెడల్‌తో పాటు విజేతలకు 15వేల కెనడియన్ డాలర్లను అందజేశారు. కెనడియన్ గణిత శాస్త్రజ్ఞుడు జాన్ చార్లెస్ ఫీల్డ్స్ అభ్యర్ధన మేరకు 1932లో ఈ బహుమతి ఏర్పాటైంది.

ఢిల్లీకి చెందిన గణిత శాస్త్రవేత్త అక్షయ్ వెంకటేష్‌కు రెండేళ్ల వయసున్నప్పుడు ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు తల్లిదండ్రులు వలస వెళ్లారు. అక్కడే విద్యాభ్యాసాన్ని కొనసాగించిన అక్షయ్ ఫిజిక్స్, మాథ్స్ ఒలంపియాడ్‌లలో చురుగ్గా పాల్గొనేవారు. 11,12 ఏళ్ల వయస్సున్నప్పుడు హైస్కూల్ స్థాయిలో జరిగే అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొని మెడల్స్, ప్రశంసలు అందుకున్నారు. 13ఏళ్లకే వెస్ట్రెన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీలో చేరి.. 1997లో 19ఏళ్ల వయస్సున్నప్పుడు మాథ్స్‌లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ సంపాదించారు. 20 ఏళ్ల వయస్సున్నప్పుడు పీహెచ్‌డీ పట్టా పొందారు. తరువాత రీసర్చ్ ఫెలోషిప్‌గా చేరి, ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

నంబర్ థియరీ, అర్థమెటిక్ జామెట్రీ, టోపోలాజి, ఆటోకార్ఫిక్ ఫార్మ్స్ అండ్ ఏర్గోడిక్ థియరీలలో వెంకటేష్ పనిచేశారు. అతని పరిశోధనలకు గానూ ఆయనకు చాలా అవార్డులు వచ్చాయి. వాటిలో ఆస్ట్రోస్కీ ప్రైజ్, ది ఇన్ఫోసిస్  ప్రైజ్, ది సేలం ప్రైజ్, శాస్త్ర రామానుజన్ ప్రైజ్‌లు ఉన్నాయి.