పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం..సమయస్ఫూర్తితో మంటలార్పిన మహిళ

                                                                                     

Last Updated : Jul 13, 2018, 09:19 PM IST
పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం..సమయస్ఫూర్తితో మంటలార్పిన మహిళ

ఆ పెట్రోల్‌బంకులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..వాహనదారులందరూ అక్కడి నుంచి పరారీ. మంటలను గమనించిన బంకులో పనిచేస్తున్న మహిళ ఉద్యోగి సమయస్ఫూర్తితో మంటలను ఆర్పేసింది. 

వివరాల్లోకి వెళ్లినట్లయితే....చైనాలోని జియాంగ్జిలోని ఓ పెట్రోల్‌ బంకులోకి ఓ వ్యక్తి బండిపై ఉండగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బండిపై ఉన్న వ్యక్తితో పాటు మిగతా వాళ్లంతా పరారీ. కానీ  ఇంధనం నింపుతున్న మహిళ ఉద్యగి ఏ మాత్రం బెదరలేదు..   ఒక్క సెకను కూడా ఆలోచించకుండా.. ధైర్యంగా అగ్నిమాపక పరికరం తెరిచి 12 సెకన్ల వ్యవధిలోనే మంటలు ఆర్పేసింది. ఒక్క ఐడియాలో జీవితాన్ని మార్చినట్లు.. ఒక్క ధైర్యం కొన్ని జీవితాలను కాపాడింది కదూ...

కాగా ఈ ఘటనంతా అక్కడి సీసీటీవీలో రికార్డయింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన  వీడియో మీరు చూడండి..

ప్రాణాలను పణంగా పెట్టి మహిళ ప్రదర్శించిన సాహసానికి సలాం కొట్టేల్సిందే... కాగా 'మహిళ ధైర్యానికి  సలాం', ‘సూపర్‌ హీరో ఆఫ్‌ ది డే, హ్యాట్సాఫ్‌’, ‘ఇలా చక్కగా శిక్షణ పొందిన సిబ్బందిని చూడటం చాలా సంతోషంగా ఉంది, గుడ్‌ జాబ్‌’, ‘ఈ మహిళకు స్పెషల్‌ బోనస్‌ ఇవ్వాలి’ అంటూ ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. 

Trending News