అమరవాతి: ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు స్కూల్ విద్యార్ధులకు మాత్రమే వర్తించే అమ్మఒడి పథాకాన్ని ఇప్పుడు తాజాగా ఇంటర్ విద్యార్థులకూ వర్తింపజేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసులో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ ..ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించారు.
తాజా నిర్ణయంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ జూనియర్ కాలేజీలతోపాటు హాస్టల్లో ఉంటూ చదివేవారు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఉండే వారికి కూడా ఏడాదికి రూ.15 వేలు చెల్లిస్తారు. అయితే తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుంది.