AP Pensions Verify: ఏపీలో బోగస్ పెన్షన్ల ఏరివేత, ఎప్పట్నించి వెరిఫికేషన్ ఎలా చేస్తారు

AP Pensions Verify: ఏపీలో కూటమి ప్రభుత్వం పింఛన్‌దారులకు షాక్ ఇవ్వనుంది. బోగస్ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం చేసింది. పెన్షనర్ల జాబితాలో అనర్హులు ఎక్కువగా ఉన్నారనే ఆరోపణల నేపధ్యంలో మొత్తం ప్రక్రియనే సెట్ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 4, 2025, 03:11 PM IST
AP Pensions Verify: ఏపీలో బోగస్ పెన్షన్ల ఏరివేత, ఎప్పట్నించి వెరిఫికేషన్ ఎలా చేస్తారు

AP Pensions Verify: ఏపీలో ఊహించినట్టే బోగస్ పెన్షన్ల ఏరివేత ప్రారంభం కానుంది. ముఖ్యంగా వికలాంగ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల పెన్షన్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలో పూర్తి చేయనుంది. ఇప్పటికే ఈ మేరకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనుంది. ఇప్పటికే గ్రామ స్తాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అధికారులు, సిబ్బంది పని విభజన చేస్తూ తగిన మార్గదర్శకాలను జిల్లా కలెక్టర్లకు జారీ చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకూ 3000 ఉన్న వికలాంగ పెన్షన్‌ను ప్రభుత్వం 6 వేలకు పెంచింది. ఇక 10 వేల రూపాయలుగా ఉన్న దీర్ఘకాలిక పెన్షన్‌ను 15 వేలు చేసింది. ఫలితంగా పెన్షన్ బడ్జెట్ కూడా భారీగా పెరగనుంది. అందుకే ప్రభుత్వం అనర్హుల్ని తొలగించే ప్రక్రియ చేపట్టింది. ఈ ధృవీకరణ పూర్తయ్యేవరకు కొత్త వికలాంగ సర్టిఫికేషన్లను నిలిపివేసింది. 

నకిలీ వికలాంగ పత్రాలతో పెన్షన్ పొందుతున్నవారికి గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షలు 2026 ఏప్రిల్ , మే వరకు కొనసాగనున్నాయి. నకిలీ వికలాంగ సర్టిఫికేట్లు జారీ చేసే వైద్యుల్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోనుంది. నకిలీ పెన్షన్ల వెరిఫికేషన్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది. హెల్త్ పెన్షన్లయితే పక్షపాతం కలిగిన వ్యక్తి చక్రాల కుర్తీ లేదా మంచానికి పరిమితమై ఉండాలి. ఇక తీవ్రమైన కండరాల బలహీనత , ప్రమాద బాధితులుగా ఉండాలి. 

ఇక వికలాంగ పెన్షన్లకు లోకోమోటర్ లేదా ఆర్దోపెడిక్ హ్యాండీక్యాప్డ్, కంటి చూపు సమస్య, వినికిడి సమస్య, మెంటల్ రిటార్టేషన్, మానసిక ఆరోగ్యం, మల్టిపుల్ డిజెబిలిటీ ఉంటేనే పెన్షన్ అందుతుంది. పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియపై సిబ్బందికి అవసరమైన శిక్షణ అందిస్తారు. జిల్లా స్థాయిలో కో ఆర్డినేషన్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ ఛైర్మన్ ఆ జిల్లా కలెక్టర్ ఉంటారు. మెంబర్ కన్వీనర్‌గా డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వ్యవహరిస్తారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, జిల్లా హాస్పిటల్ సర్వీస్ కో ఆర్డినేటర్, జిల్లా లెప్రసీ ఆఫీసర్, జిల్లా పంచాయితీ అధికారి, జిల్లా పరిషత్ సీఈవో, మున్సిపల్ కమీషనర్, పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధులు ఉంటారు. 

రాష్ట్రంలో దీర్ఘకాలిక, దివ్యాంగ పెన్షనర్లు 8,18,900 మంది ఉండగా అందులో దీర్ఘకాలిక వ్యాధుల పెన్షనర్లు 30, 924 మంది ఉన్నారు. మిగిలినవారు వికలాంగులు. వెరిఫికేషన్ కోసం ఇంటింటికీ వెళ్తారు. ఆసుపత్రుల్లో కూడా వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. ప్రతి మెడికల్ టీమ్ రోజుకు 25 పెన్షనర్ల వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. చివరిగా వెరిఫికేషన్ పూర్తయ్యాక ర్యాండమ్‌గా 5 సాతం వెరిఫికేషన్లు జిల్లా కలెక్టర్ టీమ్ చేస్తుంది.

Also read: Hmpv Virus Precautions: హెచ్ఎంపీవీ చైనా కొత్త వైరస్ నుంచి ఎలా కాపాడుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News