Pawan kalyan: వరద ప్రాంతాల్లో అందుకే వెళ్లలేదు.. ప్రతిపక్షాలకు గట్టిగా ఇచ్చి పడేసిన డిప్యూటీ సీఎం.. వీడియో ఇదిగో..

Heavy floods in vijayawada: భారీ వర్షాలతో ఏపీ లోని పలు ప్రాంతాలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో ఎక్కడ చూసిన కూడా బురద మాత్రమే కన్పిస్తుంది. ఇప్పటికి కూడా విజయవాడలోని పలు ప్రాంతాలు వరదల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అపోసిషన్ పార్టీలు చేస్తున్న విమర్శలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Sep 3, 2024, 11:12 PM IST
  • వైఎస్సార్సీపీని ఉతికి ఆరేసిన పవన్ కళ్యాణ్..
  • ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందన్న జనసేనాని..
Pawan kalyan: వరద ప్రాంతాల్లో అందుకే వెళ్లలేదు.. ప్రతిపక్షాలకు గట్టిగా ఇచ్చి పడేసిన డిప్యూటీ సీఎం.. వీడియో ఇదిగో..

Pawan kalyana clarity on ysrcp allegations: ఆంధ్ర ప్రదేశ్ లో వరదలు ప్రజలకు తీరని కన్నీళ్లను మిగిల్చాయని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా విజయవాడలోని సింగ్ నగర్ లో భారీగా వరదలు సంభవించాయి. ఎక్కడ చూసిన కూడా వరద ప్రవాహామే కన్పిస్తుంది. అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం తాగేందుకు మంచి నీళ్లు, కట్టుకునేందుకు బట్టలు సైతం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 

ఈ నేపథ్యంలో ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి.. అక్కడ సహాయక చర్యలలో పాల్గొంటున్నారు.అంతేకాకుండా.. మంత్రులు, అధికారుల్ని సైతం పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతి ఒక్కరికి సహాయం అందేలా చూడాలని దగ్గరుండీ మరీ చూస్తున్నారు. వరదల్లో సహాయం కోసం కేంద్ర సహాకారం సైతం తీసుకున్నారు.ఈ క్రమంలో బోట్ ల మీద, జేసీబీల మీద కూడా చంద్రబాబు ప్రయాణం చేస్తు.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.

వరద ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఇదే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం.. వరద ప్రాంతాల్లో ఎక్కడ కన్పించలేదు. దీంతో అపోసిషన్ పార్టీలు పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారు. డిప్యూటీ సీఎంకు బాధ్యతలేదా.. ప్రజల్ని పట్టించుకోవడానికి తీరిక లేదా.. బర్త్ డే పార్టీలలో ఇంకా బిజీగా ఉన్నారా.. అంటూ వైఎస్సార్సీపీ వాళ్లు విమర్శించారు.. దీనికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ అపోసిషన్ పార్టీలకు గట్టిగానే ఇచ్చిపడేశారు.

పూర్తి వివరాలు..

వరద బాధితులను కనీసం పరామర్శించలేదని వస్తున్న ఆరోపణలు, విమర్శలపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనదైన స్టైల్ లో స్పందించారు. కొందరు కావాలని ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తాను భౌతికంగా వరద ప్రాంతాల్లో లేకపోయిన.. అన్ని సహాయక కార్యక్రమాలను మానిటరింగ్    చేస్తున్నానని చెప్పారు. ఆయా శాఖల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు.

ఇదే అంశంపై  మీడియాతో మాట్లాడిన ఉపముఖ్యమంత్రి పవన్.. తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను ఖండించారు. విపత్తు నిర్వహణ కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో.. హోంమంత్రి అనితా, రెవన్యూ ముఖ్య కార్యదర్శిసిసొడియా ఉన్నారు. వరదల నేపథ్యంలో.. ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలో..అధికారులు సూచనల మేరకు.. తాను వరద ప్రాంతాల్లో పర్యటించలేదని క్లారిటీ  ఇచ్చారు. 

అందుకే వరద ప్రాంతాల్లో వెళ్లలేదు..

వదర ప్రాంతాలలో.. సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగకూడదనే..  నేను వరద ప్రాతాలలో పర్యటించలేదని పవన్ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం యాక్టివ్ గా పనిచేస్తుందన్నారు. తాను వదర ప్రాంతంలో వెళితే.. అక్కడి అధికారులకు ఇబ్బందులు కల్గవచ్చని అన్నారు.  వైసీపీ చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కావాలని చేస్తున్న విమర్శలు, ఏదో మాట్లాడాలని తప్ప వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదని పవన్ క్లారిటీ ఇచ్చారు.

తన పర్యటన వల్ల.. సహాయక కార్యక్రమాలు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని పపన్ అన్నారు. తమ వల్ల ఒకరికి భారం అయ్యేలా.. ఇబ్బంది కరపరిస్థితుల్లో ప్రజలకు.. మరింత ఇబ్బందులు కల్గకూడదని తాను.. పర్యటించలేదని డిప్యూటీ సీఎం క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వరదల నేపథ్యంలో ఉన్న ప్రస్తుతం.. రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. వరద ప్రభావ బాధితులకు పవన్ అండగా నిలిచారు. కోటిరూపాయల్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

Read more: Floods in AP: వరద విలయం.. చంటి బిడ్డను ప్లాస్టిక్ షీట్ మీద ఉంచి.. గుండెను పిండేస్తున్న వీడియో..

తన పర్యటన వల్ల అదనపు భారంకాకూడదనే..రాలేదంటూ కూడా చెప్పారు. అంతేకాకుండా.. వరదల్లో సహాయంకావాల్సిన వారు.. 112, 1070, 18004250101 నంబర్ లకు కాల్ చేయాలని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News