Sea Plane: పర్యాటక పరంగా ఆంధ్ర ప్రదేశ్ మరో అద్భుత అవకాశం.. త్వరలో సీ ప్లేన్ టూరిజం..

Sea Plane Tourism: పర్యాటక పరంగా ఆంధ్ర ప్రదేశ్ మరో అద్భుత అవకాశం అందుబాటులోకి రానుంది. పచ్చని కొండల ప్రకృతి సోయగాలు.. జలమార్గం... నగరాల్లోని ఆకాశ హర్మ్యాలు.. ఇవన్నీ తిలకిస్తూ ఆకాశ విహారం చేసే అవకాశం ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రాబోతోంది. దేశంలోనే తొలిసారి పర్యాటకంగా సీప్లేన్‌ వినియోగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 9, 2024, 09:12 AM IST
Sea Plane: పర్యాటక పరంగా ఆంధ్ర ప్రదేశ్ మరో అద్భుత అవకాశం.. త్వరలో సీ ప్లేన్ టూరిజం..

Sea Plane Tourism: పర్యాటక పరంగా ఆంధ్ర ప్రదేశ్ మరో ముందడుగు వేసింది. విజయవాడలోని పున్నమిఘాట్‌ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్‌లో సీఎంతోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రయాణించి పరిశీలించనున్నారు..
ఎన్నో ప్రత్యేకతలు.. వినూత్న అనుభూతులు మిగిల్చే సీ ప్లేన్‌ ప్రయాణం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇటీవల అంతర్జాతీయ డ్రోన్‌ సదస్సుతో వరల్డ్ వైడ్ గా అందరి అటెన్షన్ రాష్ట్రం ఉండేలా చేసి సక్సెస్ అయింది. తాజాగా సీ ప్లేన్‌ ప్రయాణాన్ని అందుబాటులోకి తేవడం ద్వారా మరోసారి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది. దీనిలో 14 మంది ప్రయాణించొచ్చు. దీనికి ఇప్పటికే ట్రయల్‌రన్‌ నిర్వహించారు.

Add Zee News as a Preferred Source

సీ ప్లేన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సుమారు 150 కిలోమీటర్ల ఆకాశయానం ఉంటుంది. భూమి ఉపరితలం నుంచి 15 వందల అడుగుల ఎత్తులో సీ ప్లేన్‌ ప్రయాణిస్తుంది. సాధారణంగా విమానాలు భూమికి 15 నుంచి 20 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. సీ ప్లేన్‌లు కూడా అదే స్థాయిలో ఎగిరే అవకాశం ఉన్నా.. పర్యాటకులకు ప్రకృతి అందాలను చూపించే అనుభూతి కల్పించాలన్నదే ఆలోచనగా అధికారులు చెబుతున్నారు. ఈ ప్రయాణానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ ఏటీసీ నుంచి అవసరమైన అనుమతులను అధికారులు తీసుకున్నారు.

విజయవాడ నుంచి శ్రీశైలం వరకు ప్రయాణానికి 30 నిమిషాలే పడుతుంది. ఇందులో టేకాఫ్, ల్యాండింగ్‌ కోసం 10 నిమిషాలు పోను.. 20 నిమిషాలు ఆకాశంలో  విహరిస్తారు. ప్రస్తుతం పున్నమిఘాట్‌ నుంచి నేరుగా శ్రీశైలం వెళ్లేలా రూట్‌ను అధికారులు ఎంపిక చేశారు. టేకాఫ్, ల్యాండింగ్‌ రెండూ నీటిలోనే ఉండడం దీని స్పెషాలిటీ. సాధారణ విమానాల్లా దీనికి రన్‌వే అవసరం లేదు. దీనికోసం నీటిలో తేలియాడే జెట్టీలను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ప్రత్యేక జెట్టీని అధికారులు ఏర్పాటు చేశారు. శ్రీశైలంలో ఇప్పటికే ఉన్న జెట్టీలను తాత్కాలికంగా వినియోగించుకోనున్నారు. జెట్టీ నుంచి ర్యాంపు ద్వారా సీ ప్లేన్‌లోకి ఎక్కేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

ఈ ప్రయోగం విజయవంతమైన తర్వాత సీ ప్లేన్‌ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఛార్జీల కింద ఎంత మొత్తం వసూలుచేయాలి? రోజుకు ఎన్నిసార్లు నడపాలనే ప్రతిపాదనలను అధికారులు రూపొందించనున్నారు. టెండరు ప్రక్రియ ద్వారా గుత్తేదారు సంస్థను ఎంపిక చేసి సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News