హోంగార్డులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్

హోంగార్డులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్

Updated: Oct 12, 2019, 11:00 PM IST
హోంగార్డులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్
File photo

అమరావతి: హోంగార్డులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. హోంగార్డుల జీతాన్ని రూ. 18 వేల నుంచి 21,300 రూపాయలకు పెంచుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారంలోకి రాకముందు పాదయాత్రలో ఉన్నప్పుడు హోంగార్డులకు ఇచ్చిన హామీ మేరకే తాజాగా సీఎం వైఎస్ జగన్ వారి జీతాన్ని పెంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

హోంగార్డులకు జీతం పెంచడంపై రాష్ట్ర పోలీసుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాస రావు స్పందిస్తూ.. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు ఆనందంగా ఉందంటూ  హర్షం వ్యక్తం చేశారు.