AP Politics: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు నెల్లూరు రాజకీయ నాయకులు షాక్ ఇస్తున్నారు. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్ధి తెలుగుదేశంలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయినట్టుగా సమాచారం. ఇదే నిజమైతే వైసీపీ ప్లాన్ బి సిద్దం చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న అభ్యర్ధులు మార్పులు నెల్లూరులో పెనుమార్పులకు కారణమౌతోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీగా టికెట్ ఖరారు చేశారు. అయితే నెల్లూరు సిటీ, ఉదయగిరి, కావలి అభ్యర్ధుల్ని మార్చాలని వేమిరెడ్డి కోరారు. నెల్లూరు సిటీ నుంచి తన భార్య ప్రశాంతిని నిలబెట్టాలనేది ఆయన ఆలోచన. అయితే ఆ స్థానంలో వైసీపీ అధిష్టానం డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్ పేరును ఖరారు చేసింది. దాంతో మనస్తాపానికి గురైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ అయినట్టు సమాచారం. కొద్దిరోజులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ నేతలతో అందుబాటులో లేరు. వైసీపీ ఎంపీ సీటు దక్కని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో సమావేశమైన వేమిరెడ్డి చంద్రబాబును కూడా కలిశారని తెలుస్తోంది. ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈసారి నెల్లూరు రూరల్ నుంచి సీటు ఖరారు చేసింది. వాస్తవానికి ఆయన కూడా పార్టీ వీడనున్నట్టు వార్తలొచ్చినా ఆదాల దానిని ఖండించారు. తాను వైసీపీ నుంచే పోటీ చేస్తానని స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశంలో చేరనున్నట్టుగా వార్తలొస్తున్నాయి.
ఇదే నిజమైతే ప్లాన్ బి సిద్ధం అమలు చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. వేమిరెడ్డి స్థానంలో ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డితో పాటు మరో వ్యాపారవేత్తను బరిలో దింపే ఆలోచనలో ఉంది పార్టీ. మరోవైపు వచ్చేవారం నెల్లూరు పార్టీ నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. రోజురోజుకూ మారుతున్న నెల్లూరు రాజకీయ సమీకరణాలకు చెక్ పెట్టనున్నారు.
Also read: Cash Without ATM: ఇక ఏటీఎం లేకుండానే ఓటీపీతో డబ్బులు తీసుకోవచ్చు, ఎలాగో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook