ఆంధ్ర యూనివర్శిటీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వర్శిటీల్లో ప్రధమ స్థానంలో నిలిచింది. టైమ్స్ హ్యూమర్ ఎడ్యూకేషన్ నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం తేలింది. బోధన, పరిశోధనలు, విద్యార్థి ఆచార్యుల నిష్పత్తి, క్యాంపస్ సెలక్షన్స్, మౌలిక వసతులు వంటి అంశాలన పరిగణనలోకి తీసుకొని టైమ్స్ హ్యూమర్ ఎడ్యూకేషన్ సంస్థ ర్యాంకులను జారీ చేసింది. గత ఏడాది మారిదిగా 801 నుంచి 1000 ర్యాంకుల శ్లాబ్ లో ఉన్పప్పటికీ గతం కంటే కొంత మెరుగైన స్థానాన్ని కైవసం చేసుకొని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వర్శిటీల్లో ఏయూ అగ్రగామిగా నిలిచింది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలోనూ దేశవ్యాప్తంగా ఉన్న వర్శిటీల్లో ఏయూ 43వ ర్యాంకు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.