AP BRS Chief Thota Chandra Sekhar: చంద్రబాబుని మించిన జగన్.. పీవీ తర్వాత మళ్లీ కేసీఆరే

AP BRS Chief Thota Chandra Sekhar's Vizag Speech: ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా నియమితులైన తరువాత ఆ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో డా తోట చంద్రశేఖర్ విశాఖలో పర్యటించారు. విశాఖ సభలో విశాఖ వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఏపీలో కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థించడానికి వెనుకున్న కారణాలు, అవసరం ఏంటో వివరించారు. ఇంతకీ తోట చంద్రశేఖర్ చెబుతున్న ఆ అవసరం ఏంటో తెలుసుకుందాం రండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2023, 06:31 AM IST
AP BRS Chief Thota Chandra Sekhar: చంద్రబాబుని మించిన జగన్.. పీవీ తర్వాత మళ్లీ కేసీఆరే

AP BRS Chief Thota Chandra Sekhar's Vizag Speech: విశాఖ నా తల్లి వేరు లాంటిది అంటూ విశాఖపట్టణంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు డా తోట చంద్రశేఖర్. ఏపీలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా శనివారం తోట చంద్రశేఖర్ విశాఖ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి, దేశ రాజకీయాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తొలుత విశాఖతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ఉన్నత విద్య ఇక్కడే పూర్తి చేశా... పీజీ, పీహెచ్డీ, ఐఏఎస్ కి సెలక్ట్ అయింది కూడా ఇక్కడి నుంచే. నన్ను ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్లిన తల్లిలాంటి నా ఊరికి రావడం ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు.
 
విభజన హామీల విషయంలో కేంద్రం ఘోరంగా వంచించింది. తొమ్మిదేళ్లుగా ఒక్క విద్యాసంస్థని కూడా కేంద్రం పూర్తి చేయలేదు. పోలవరం నిధులు రాకపోయినప్పటికీ ఏపీ సీఎం బేలగానే మాట్లాడుతున్నారు. హక్కుల్ని రాబట్టడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరిస్తాం అని కేంద్రం చెబుతోంటే సీఎం జగన్ ఎందుకు నోరెత్తడం లేదు... 39 మంది ఎంపీలు ఉండి ఎందుకు కేంద్రానికి సాగిల పడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరిస్తే  అడ్డుకునే శక్తి మీకు లేదా ? 5 వేల కోట్లు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకునే శక్తి ఏపీ సర్కారుకి లేదా ? అంటూ తోట చంద్రశేఖర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 

గంగవరం పోర్టు ప్రైవేటీకరణలో పెద్ద కుంభకోణం దాగి ఉంది. రెండు వేల ఎకరాల్ని 400 కోట్లకు అదానీ సంస్థకి ఇచ్చేశారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పై కన్నేశారు. ప్టీల్ ప్లాంట్ మొత్తం నష్టాలు 14వేల కోట్లు.  అంతకంటే ఎక్కువ నష్టాల్లో ఉన్న ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు అమ్మేస్తారా..... ఇదేం దారుణం. 1982వరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెయిల్ లో భాగంగా ఉండేది. అప్పుడు ప్లాంటుకి ప్రత్యేకంగా గనులు ఉండేవి. సెయిల్ నుంచి వేరు చేసేటప్పుడు గనులు ఇవ్వక పోవడం కూడా పెద్ద కుట్రే. దానివల్లే స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లింది. నవరత్న కంపెనీల్లో స్థానం దక్కించుకోవడం కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎంతో కష్టపడ్డారు. వారి శ్రమని నీళ్ల పాలు చేస్తున్నట్టుగా ఈ సంస్థని ఉద్దేశపూరితంగా నష్టాల్లోకి నెట్టేశారు.
 
ఏపీ రాజకీయ పార్టీలు బీజేపీ స్వార్ధానికి పావులవుతున్నాయి. జగన్ మాట్లాడరు, చంద్రబాబు మాట్లాడరు. మిగతా పార్టీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీకి ఏపీలో ప్రత్యేక ప్రయోజనాలు ఏవీ లేవు. అందుకే రాష్ట్రంతో చెలగాటం అడుతోంది. పోలవరం ప్రాజెక్టుకి కూడా తొమ్మిదేళ్లలో ఇచ్చింది 20 వేల కోట్లు మాత్రమే ఇచ్చింది. అయినా ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పే పరిస్థితి లేదు. ఏపీలోని రాజకీయ నిస్తేజాన్ని చూసే బీఆర్ఎస్ గొంతెత్తింది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై గొంతెత్తింది కేసీఆరే. విభజన హామీల విషయంలో ఘోరంగా వంచించడాన్ని కూడా నిలదీశారు. ఇప్పుడు ప్రైవేటీకరణ విశాఖ స్టీల్ ప్లాంట్ తోనే ఆగదు. అందుకే పోరాటానికి సిద్ధమయ్యాం. నినాదాలకు పరిమితం కాబోం. పోరాట పంథాలో నడుస్తాం.

ఇది కూడా చదవండి : AP Transfers: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు, కొత్త జిల్లాలకు ఎస్పీలు

చంద్రబాబు కంటే ఘోరంగా జగన్ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ ముందు మోకరిల్లారు. అందుకే రాష్ట్రం ఘోరంగా నష్టపోతోంది. ఏపీలో సమస్యలపై మాట్లాడకుంటే వైసీపీకి అధికారం ఎందుకు? ఇక్కడ నిరుద్యోగం పెరిగింది. ధరల పెరుగుదల ఘోరంగా ఉంది. మన ఆస్తులు అమ్మేసి ప్రైవేటీకరణ ముసుగు వేస్తే వదిలేస్తామా ? అందుకే మా పోరాటం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుంది. ఏపీకి ఉన్న వనరులు మరే రాష్ట్రానికీ లేవు. 26 నదులు ఉన్నాయి. సారవంతమైన నేలలు, తీర ప్రాంతం, మంచి మానవ వనరులు ఉన్నప్పటికీ... నాయకత్వ లోపం ఏపీని వేధిస్తోంది. తెలంగాణాలో కేసీఆర్ సమర్ధ నాయకత్వం వల్ల దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. మరి ఏపీ ఎక్కడ ఉంది అని తోట చంద్రశేఖర్ ప్రశ్నించారు.

తలసరి ఆదాయంలో నాగాలాండ్ మిజోరం కంటే ఏపీ తక్కువ ఎందుకు ఉంది. ఏపీని అభివృద్ధి పథంలోకి తేవాలంటే చిత్తశుద్ధితో రాష్ట్రం కోసం పోరాడే నాయకులు కావాలి. బీజేపీని దేశంలోనే ఎదుర్కొనే శక్తి ఉంది కేసీఆర్ కి మాత్ర మే. దేశానికి బీజేపీ చేస్తున్న అన్యాయంపైనే కేసీఆర్ పోరాటం. ప్రతిపక్షాల్ని రూపు మాపే కుట్రల్ని అడ్డుకోవడం కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవించింది. కేసీఆర్ స్థాయి నాయకుడు దక్షణ భారతదేశంలోనే లేరు. తెలుగు జాతికి ఆయనే నాయకుడు. ఈ విషయంలో మీరంతా నాతో ఏకీభవిస్తారని భావిస్తా. పీవీ నరసింహారావు తర్వాత ప్రధాని కాగల అర్హత ఉన్న ఏకైక తెలుగు నేత కేసీఆర్ మాత్రమే అని చంద్రశేఖర్ కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాలు పురోగమించాలని కోరుకుందాం. తెన్నేటి విశ్వనాధం, అమృతరావు స్ఫూర్తితో ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాలి. ప్రైవేటుపరం అయితే మనది అనే భావనే పోతుంది. ఉద్యోగాలు ఉండవు. రిజర్వేషన్లు ఉండవు. గుజరాత్ నుంచి జనాన్ని దింపినా మనం ఏమీ చేయలేం. ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటు పరం అయితే మొదట నష్టపోయేది బలహీన వర్గాల ప్రజలే అంటూ విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఇది కూడా చదవండి : AP Politics: ఏపీ అధికార పార్టీలో ఏం జరుగుతోంది, అసమ్మతి బాటలో ఆదోని ఎమ్మెల్యే ?
  
కడప స్టీల్ ప్లాంట్ కోసం జగన్ వెళ్లి జిందాల్ ని తీసుకొచ్చారు. ఆయన రిజర్వేషన్లు అమలు చేస్తారా. అదాని వచ్చినా, జిందాల్ వచ్చినా... ఎవరు వచ్చినా... అది వారి వ్యక్తిగత ఆస్తి మాత్రమే అవుతుంది. ప్రజల సొత్తు కాకుండా పోతుంది. ఇది ప్రజలపై పడే మొదటి దెబ్బ. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి ఏప్రిల్ 15 డెడ్‌లైన్ పెట్టారు. దీన్ని అడ్డుకోకపోతే... ప్రైవేటీకరణ గేట్లు తెరిచినట్టే. ఇన్ని రోజులుగా ఉద్యోగులు ఆందోళన చేస్తే పట్టించుకున్నారా. అందుకే కలిసి కట్టుగా పోరాడదాం. ఇది విశాఖకు తీవ్ర అన్యాయం చేయడమే అవుతుంది. మీరు కలిసి వస్తే నేను అడ్డుకుంటా అని కేసీఆర్ చెబుతున్నారు. ఆయన నాయకత్వాన్ని బలోపేతం చేస్తేనే మనం బలమైన ఉద్యమాన్ని నిర్మించగలం. అందుకే అందరూ కలిసి రండి. సమయం ఎక్కువ లేదు. వైజాగ్‌లో ఉన్న ప్రజలు కలిసి రావాలి. రైతు రాజ్యం ఏర్పాటు కావాలనేది కేసీఆర్ ఆకాంక్ష. ఇప్పటికీ దేశంలో 67 శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. అందుకే రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటాలు చేస్తోంది అని కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు అవసరం ఉందని ఏపీ వాసులకు తోట చంద్రశేఖర్ విజ్ఞప్తిచేశారు.

ఇది కూడా చదవండి : EX CM Kiran Kumar Reddy: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్‌ కుమార్ రెడ్డి.. ఏ బాధ్యతలు అప్పగించినా రెడీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News