AP Budget Session: చప్పగా ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ప్రతిపక్షం లేకుండా భజన పక్షంగా.. !

AP Budget Session: ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కూడా హాట్ హాట్ గా సాగుతున్నాయి. సభ ప్రారంభమైన తొలి రోజు హడావుడి చేసిన ఏపీ ప్రతిపక్ష పార్టీ . ఆ తర్వాత సభకు మాత్రం గైర్హాజరయ్యారు. తమ పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులకు దిగుతుందని ప్లకార్డులతో వైసీపీ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ తమ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ ఆవరణలో ఆందోళనకు దిగారు.  అంతేకాదు ఆందోళలతో సభను బాయ కాట్ చేసారు.    

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 26, 2024, 08:10 AM IST
AP Budget Session: చప్పగా ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ప్రతిపక్షం లేకుండా భజన పక్షంగా.. !

AP Budget Session: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఏక పక్షంగా సాగుతున్నాయి.  మొత్తంగా అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాయ్ చేసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ ఆందోళణను ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకీ షిప్ట్ చేశాడు. దీంతో అసెంబ్లీలో వైసీపీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ప్రతిపక్ష పార్టీకీ సంబంధించిన ఎమ్మెల్యేలు లేకపోవడంతో అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా కొనసాగుతున్నాయి. దీంతో సమావేశాలపై ఏపీ రాజకీయ వర్గాలతో పాటు జనంలో కూడా ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. అబ్బే మన అసెంబ్లీ సమావేశాలు చాలా చప్పగా సాగుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిక్షం లేకపోవడంతో దాని వెలితి స్పష్టంగా కనపడుతుందని లాబీల్లో నేతలు చెప్పుకుంటున్నారు.

ఒక పక్క పక్కనే ఉన్న తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిక్షాల మధ్య హోరాహోరా జరుగుతుంటే మన దగ్గర మాత్రం సమావేశాలు సాదాసీదాగా కొనసాగుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఎంతైనా ప్రతిపక్షాలు  ఉంటే ఆ మజానే వేరు. ప్రస్తుతం సభలో ఎంత సేపు భజన పర్వంలా కొనసాగుతుంది. అదే ప్రతిపక్షాలు ఉంటే వాళ్లు ఇచ్చే కౌంటర్లకు కౌంటర్ అటాక్ లు ఇచ్చే వాళ్లము అప్పుడు కదా అసలు సిసలైన అసెంబ్లీ అంటే అని కూటమి ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారట. వైసీపీకీ కూడా మరీ 11 సీట్లు కాకుండా కాసింత సంఖ్యా బలం ఉంటే బాగుండేది కదా అని మరి కొంత మంది ఎమ్మెల్యేల వాదన. ఇలా మొత్తానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలపై అటు రాజకీయ పార్టీలకు, ఇటు ఏపీ జనం కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదట. పైగా ఆంధ్ర ప్రదేశ్ జనాలు కూడా తెలంగాణ అసెంబ్లీనీ ఆస్తికిగా చూస్తున్నారట. దీంతో మీడియా కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాల కవరేజ్ ను నామ మాత్రంగా చేస్తుంది.

ఇది ఇలా ఉంటే టీడీపీ ఎమ్మెల్యేల వెర్షన్ మాత్రం మరో రకంగా ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లో తమను ఒక ఆట ఆడుకున్న వైసీపీనీ ఏదో చేద్దామనుకున్నాం కానీ అదేమీ జరగడం లేదనే నిరాశలో ఉన్నారట. వైసీపీ అధికారంలో ఉండగా అసెంబ్లీలో తమ అధినేత చంద్రబాబును తీవ్రంగా అవమానించిన వైసీపీకీ ఎలాగైనా రిటర్న్ గిఫ్ట్  ఇవ్వాలని ఉబలాటపడుతున్న తమకు ఆ భాగ్యం దక్కేలా లేదని తెగ బాధపడిపోతున్నారట.

అసలే వైసీపీకీ ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలే అందులో పార్టీలో ఉండేదెవరో పోయేదెవరో తెలియదు. దీనికి తోడు కడప ఎంపీ స్థానానికి జగన్ పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారనే వార్త టీడీపీనీ మరింత కలవరపెడుతుంది. జగన్ పై రివేంజ్ తీసుకుందామని అనుకుంటున్న బాబు అభిమాన ఎమ్మెల్యేలు ఈ వార్త మరింత డిస్సాపాయింట్ చేస్తుందట.మొత్తానికి ఇలా ఏపీ అసెంబ్లీ సమావేశాలపై ఆంధ్ర జనం, రాజకీయ నేతలు ఇలా చర్చించుకుంటున్నారట. భవిష్యత్తులోనైనా అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా కొనసాగితే బాగుండు అని ఏపీ పార్టీలు అనుకుంటున్నాయట.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News