Ap Cabinet: కేబినెట్ విస్తరణలో స్పీకర్ మంత్రి అయ్యేనా?

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఇప్పుడు కేబినెట్ విస్తరణ ( Cabinet Extension ) అంశంపైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. ఖాళీ అయిన రెండు బెర్త్ లను ఎవరితో భర్తీ చేయనున్నారనే అంశంపై రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి. తనకు అధ్యక్షా అనేకంటే అమ్యాతా అని పిలిపించుకోవడమే ఇష్టమంటున్న ఆ పెద్దాయన కోరిక ఫలిస్తుందా మరి.

Last Updated : Jul 20, 2020, 02:01 PM IST
Ap Cabinet: కేబినెట్ విస్తరణలో స్పీకర్ మంత్రి అయ్యేనా?

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఇప్పుడు కేబినెట్ విస్తరణ ( Cabinet Extension ) అంశంపైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. ఖాళీ అయిన రెండు బెర్త్ లను ఎవరితో భర్తీ చేయనున్నారనే అంశంపై రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి. తనకు అధ్యక్షా అనేకంటే అమ్యాతా అని పిలిపించుకోవడమే ఇష్టమంటున్న ఆ పెద్దాయన కోరిక ఫలిస్తుందా మరి.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ( Ap Deputy cm ) , రెవిన్యూ మంత్రి ( Ap Revenue minister ) పిల్లి సుభాష్ చంద్రబోస్ ( Pilli Subhash Chandra Bose ) , పశు సంవర్ధక శాఖ మంత్రి ( Animal Husbandry minister ) మోపిదేవి వెంకట రమణ ( Mopidevi venkata Ramana ) లు రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆ రెండు బెర్త్ లు ఖాళీ అయ్యాయి. ఈ రెండింటిపై చాలామంది ఆశావహులు కన్నేశారు. అయితే ఖాళీ అయిన రెండు బెర్త్ లు బీసీలకు చెందినవి కావడంతో...అదే సామాజికవర్గంతో భర్తీ చేయించాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఆలోచనగా ఉందని తెలియడంతో బీసీయేతర ఆశావహులు నిమ్మకుండిపోయారు. మరి ఆ బెర్త్ లకు భర్తీ అయ్యే వారు ఎవరు ? Also read: Covid19 War: అగ్రస్థానంలో ఏపీ ప్రభుత్వం

ఈ నేపధ్యంలోనే అమాత్యా అని పిలిపించుకోవాలనుకుంటున్న ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారామ్ ( Ap speaker Tammineni Sitaram ) పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. బీసీ సామాజికవర్గానికి చెందడం, సీనియర్ కావడం అదనపు అర్హతలుగా ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Cm ys jagan ) కు నమ్మిన వ్యక్తి కావడం కూడా ఓ విశేషంగా ఉంది. Also read: AP: గవర్నర్ ను కలిసిన నిమ్మగడ్డ రమేశ్: ఏం జరగబోతోంది?

అదే జరిగితే మరి స్పీకర్ గా ఎవరనే ప్రశ్న వస్తోంది. దీనికి సమాధానం కూడా లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ( Deputy Speaker ) వ్యవహరిస్తోన్న బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన కోన రఘుపతి ( Kona Raghupati ) పేరు ప్రధానంగా విన్పిస్తోంది. కోన రఘుపతి తండ్రి కోన ప్రబాకరరావు గతంలో స్పీకర్ గా పనిచేశారు కూడా. రఘుపతికి స్పీకర్ గా నియమిస్తే...బ్రాహ్మణ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందనే వాదన కూడా ఉంది. మరి ఏపీ సీఎం వైెఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. Also read: ఏపీలో మరోసారి లాక్‌డౌన్ విధించనున్నారా?

Trending News