చంద్రబాబు సమ్మర్ వెకేషన్ ప్లాన్స్

చంద్రబాబు సమ్మర్ వెకేషన్ ప్లాన్స్

Updated: Apr 26, 2019, 01:17 PM IST
చంద్రబాబు సమ్మర్ వెకేషన్ ప్లాన్స్
File pic

అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి నేటి నుంచి మూడు రోజుల పాటు వేసవి విడిది నిమిత్తం హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. మండుతున్న ఎండలు, అధిక ఉష్ణోగ్రతల నుంచి కాస్తంత ఉపశమనం పొందడం కోసం ఆయన షిమ్లాను వేసవి విడిదిగా ఎంచుకున్నారు. నేటి నుంచి షిమ్లా ఆ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం తిరిగి సోమవారం నాడు చంద్రబాబు నాయుడు కుటుంబం అమరావతికి చేరుకోనుంది. 

నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ తదితరులు షిమ్లా పర్యటనలో పాల్పంచుకోనున్నారు.