close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

తిరుపతి సమీపంలో సిలికాన్ సిటీ : చంద్రబాబు

తిరుపతి వద్ద టీసీఎల్ కంపెనీ శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

Updated: Dec 20, 2018, 02:24 PM IST
తిరుపతి సమీపంలో సిలికాన్ సిటీ : చంద్రబాబు
SOURCE : ANI

తిరుపతి: భారత్‌లోనే తొలిసారి తిరుపతి సమీపంలో టీసీఎల్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రీ పార్క్‌కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం శంకుస్థాపన చేశారు. త్వరలోనే మరెన్నో ఇతర ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు హబ్‌గా మారబోతున్న ఈ ప్రాంతానికి సిలికాన్ సిటీ అని పేరు పెట్టనున్నట్టు ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. సిలికాన్ సిటీ ఏర్పాటుతో ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.