Ys jagan: పాలించేవాడు మంచోడైతే పాలితులు లాభపడతారు. అదే పాలించేవాడికి మనసున్నవాడైతే జరిగే మేలు అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్‌లో అదే జరగుతోంది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో ముందున్న వైఎస్ జగన్ ఇప్పుడు పేదవారికి మరో అద్భుత వరం అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్( Ap cm ys jagan) ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పేద, మధ్య తరగతి వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం , మహిళల కోసం, రైతన్నల కోసం, విద్యార్ధుల కోసం ఇలా ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చే పథకాల్ని ప్రవేశపెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్ మరో వరాన్ని అందిస్తున్నారు. పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు కేవలం ఒకే ఒక్క రూపాయికి ఇళ్లు ( Houses for one rupee )అందించాలని నిర్ణయించారు. ఏపీ కేబినెట్ ఈ మేరకు ఆమోదించింది. 3 వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏపీ టిడ్కో ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే అందించాలని కేబినెట్ ( Ap cabinet) నిర్ణయించింది.
వాస్తవానికి రాష్ట్ర పట్టణ మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అయిన ఏపీ టిడ్కో( AP TIDCO ) 88 మున్సిపాలిటీల పరిధిలో జీ ప్లస్ 3 విధానంలో గృహ సమూదాయాలు నిర్మించింది. ఇందులో 3 వందల ఎస్ఎఫ్‌టి యూనిట్ ధరను 2.65 లక్షలుగా నిర్ణయించింది. మొత్తం 1 లక్షా 43 వేల 6 వందల ఇళ్లను నిర్మిస్తోంది. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజుగా 5 వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి ధర 2 లక్షల 65 వేల రూపాయల్ని బ్యాంకు రుణంగా అందిస్తామని..లబ్దిదారులు వాయిదాలు చెల్లించుకోవాలని తెలిపింది. అయితే 3 వందల ఎస్ఎఫ్‌టి ఇళ్లలో( 3 hundres sft houses) ఉండేందుకు సిద్ధపడ్డారంటే ఆ లబ్దిదారులు పేదవారేనని జగన్ గుర్తించారు. అటువంటి పేదవారిపై 2.65 లక్షల రుణభారం మోపితే ఎన్నాళ్లకు తీర్చగలరనే ఉద్దేశ్యంతో ఆ ఇళ్లకు కేవలం ఒకే ఒక్క రూపాయికి అందించాలనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇక బ్యాంకు రుణం లేదు. వడ్డీలుండవు. రిజిస్ట్రేషన్ ఫీజు 5 వందలు కూడా వెనక్కి ఇచ్చేస్తారు. అంటే కేవలం ఒకే ఒక్క రూపాయికి 3 వందల చదరపు గజాల ఇంటిని పేదవారు సొంతం చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా 1 లక్షా 43 వేల 6 వందల మందికి నేరుగా ప్రయోజనం కలగనుంది.
Also read: Ap cabinet meet: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు, ఈబీసీ నేస్తం పథకానికి ఆమోదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Ys jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో చారిత్రాత్మక నిర్ణయం, కేవలం ఒక్క రూపాయికే ఇ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో చారిత్రాత్మక నిర్ణయం
పేదవారికి కేవలం ఒక్క రూపాయికే ఏపీ టిడ్కో ఇళ్లు అందించేందుకు నిర్ణయం
3 వందల చదరపు అడుగుల ఇంటిని కేవలం రూపాయి చెల్లించి సొంతం చేసుకోవచ్చు