Ys Jagan Review on Covid19: ఏపీలో స్కూళ్లు తిరిగి ప్రారంభమైన నేపధ్యంలో కరోనా మహమ్మారి నియంత్రణ, కరోనా థర్జ్‌వేవ్ సన్నద్ధత విషయమై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు.
ఏపీలో స్కూల్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో కోవిడ్ ప్రోటోకాల్స్(Covid19 Guidelines) కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)అధికారులను ఆదేశించారు. కోవిడ్ నివారణ చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. కరోనా లక్షణాలు ఎవరికైనా కన్పిస్తే తక్షణం పరీక్షలు చేయించాలని సూచించారు. వ్యాక్సినేషన్ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకోవాలని తెలిపారు. స్కూళ్లలో కోవిడ్ మార్గదర్శకాలు పాటించేలా చూడాలని..మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడంపై దృష్టి సారించాలని కోరారు. స్కూళ్లలో పరీక్షలకు చర్యలు తీసుకోవాలన్నారు.
మరోవైపు కరోనా థర్జ్‌వేవ్(Corona Third Wave) నేపధ్యంలో తీసుకోవల్సిన ముందస్తు జాగ్రత్తలపై సమీక్షించారు. వ్యాక్సినేషన్(Corona Vaccination) కార్యక్రమాన్ని ముమ్మరం చేయడమే కాకుండా ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులున్నాయన్నారు.పెళ్లిళ్లలో కేవలం 150 మందికే అనుమతి ఉంటుందన్నారు. కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా థర్డ్‌వేవ్ సన్నద్దత విషయంలో చర్చించారు. 20 వేల 464 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉండగా..డీ టైప్ సిలెండర్లు 27 వేల 311 ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆగస్టు నెలాఖరుకు 104 ప్రాంతాల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు పూర్తవుతాయని వివరించారు. సెప్టెంబర్ రెండోవారానికి మరో 36 ప్రాంతాల్లో పూర్తి కానున్నాయి.
Also read: Heavy Rains Alert: ఏపీలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, మరో 48 గంటలు ఇదే పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook