New Bars in Ap: ఏపీలో కొత్తగా బార్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 53 బార్ లైసెన్సుల మంజూరుకు నోటిఫికేషన్ జారీ అయింది. ఏడాది కాల వ్యవధికై ఈ కొత్త బార్లు ప్రారంభం కానున్నాయి. ఏడాది తరువాత రెన్యువల్ లేదా కొత్తవాటికి అవకాశమిస్తారు. దీనికి సంబంధించిన విధివిధానాలు వెలువడ్డాయి.
ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ ప్రవేశపెట్టి రాష్ట్రవ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాలు ప్రారంభించింది. మద్యం బ్రాండ్లతో పాటు ధరలపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పుడిక కొత్తగా బార్లకు అనుమతిలివ్వనుంది. ఇందులో భాగంగా ఏడాది కాల వ్యవధితో బార్లకు లైసెన్సులు మంజురు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వేలం, ఆన్‌లైన్ లాటరీ విధానంలో కొత్త బార్‌లను కేటాయిస్తారు. ఈ నెల 22 వరకూ రిజిస్ట్రేషన్ ఉంటుంది.
కొత్త బార్లకు ఫీజులు, మార్గదర్శకాలు
కొత్త బార్లకై ప్రభుత్వం జారీ చేసిన విధివిదానాల ప్రకారం 50 వేల జనాభా వరకు 5 లక్షల నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఉంటుంది. 50 వేల నుంచి 5 లక్షల్లోపు జనాభా ఉంటే 7.5 లక్షలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. 5 లక్షలపైన జనాభా ఉంటే దరఖాస్తు ఫీజు 10 లక్షల రూపాయలు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలున్నాయి. ఇప్పుడు కొత్తగా 53 బార్లు రానున్నాయి.
మద్యం దుకాణాల్లో ఎంఆర్పీకు మించి అమ్మితే జరిమానా విధించనున్నారు. మొదటి సారి పట్టుబడితే 5 లక్షల ఫైన్ ఉంటుంది. ఆ తరువాత కూడా కొనసాగితే దుకాణాల లైసెన్స్ రద్దవుతుంది. ఇక మద్యం షాపు యజమానులు బెల్ట్ షాపులు ప్రోత్సహిస్తే చర్యలు ఉంటాయి.
Also read: AP Heavy Rains: ఏపీకు బిగ్ అలర్ట్, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.