Movie Ticket Price in Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ విన్పించనుంది. రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదానికి తెరపడనుంది. టికెట్ల ధరల పెంపుకు సంబంధించి జీవో విడుదల కానుంది.
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల్ని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై వివాదం రేగింది. గత ఆరు నెలలుగా నడుస్తున్న ఈ వివాదం తారాస్థాయికి చేరింది. సినీ పరిశ్రమ రెండు వర్గాలుగా చీలిపోయింది కూడా. అటు ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ కూడా వచ్చేసింది. ఓ దశలో ఈ వివాదం పరిష్కారం కాదన్పించింది. సినీ పరిశ్రమల సమస్యలపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించింది. చిరంజీవికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఆ తరువాత రెండవ దశలో చిరంజీవి నేతృత్వంలో రాజమౌళి, మహేశ్ బాబు, ప్రభాస్, కొరటాల శివ, నారాయణ మూర్తి, అలీ, పోసాని కృష్ణమురళి తదితరులు కలిశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చర్చ జరిపారు. వారం పది రోజుల వ్యవధిలో గుడ్‌న్యూస్ వస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పుుడా సందర్భం వచ్చేసింది. ఇవాళ లేదా రేపు సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ విన్పించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. అటు ప్రేక్షకులకు ఇటు చిత్ర పరిశ్రమకు ఇబ్బంది లేకుండా ధరలు ఖరారు చేసినట్టు సమచారం. సినిమా టికెట్ల వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన కమిటీ రూపొందించిన నివేదిక ఆధారంగా జీవో సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ విషయంపై కోర్టులో విచారణ నడుస్తోంది. కమిటీ నిర్ధారించిన ధరల్ని కోర్టుకు సమర్పించిన తరువాత..కోర్టు అనుమతితో జీవో విడుదల కావచ్చని కొంతమంది అంటున్నారు.
త్వరలో విడుదల కానున్న కొత్త జీవో ప్రకారం కనీస ధర 40 రూపాయలు కాగా, గరిష్ట ధర 140 రూపాయలు కావచ్చు. పంచాయితీలు, నగర పంచాయితీలను ఒకే కేటగరీలో తీసుకున్నారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లను రెండవ కేటగరీలో తీసుకున్నారు. మెట్రో పాలిటల్ నగరాల్ని మూడవ కేటగరీలో పరిగణిస్తున్నారు. ఏసీ థియేటర్లలో కనీస ధర 70 రూపాయలు కావచ్చు. రెండ్రోజుల్లో ప్రభుత్వం ఈ ధరలకు సంబంధించి కొత్త జీవో విడుదల చేయనుందని సమాచారం.
Also read: Pawan Kalyan Rally: ర్యాలీలో అపశ్రుతి.. జనసేనాని పవన్ కల్యాణ్ కు తప్పిన ప్రమాదం! Video
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook