Balineni Srinivasa Reddy: నిధులు మా జేబులో వేసుకోము.. TRS ప్రభుత్వానికి ఏపీ మంత్రి చురకలు

వ్యవసాయ బిల్లుల విషయంలో ేఏపీ (AP Minister Balineni Srinivasa Reddy), తెలంగాణ ప్రభుత్వాలు భిన్నవైఖరిని ప్రదర్శిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపగా, తెలంగాణ ప్రభుత్వం ఆ బిల్లులు రైతులకు వ్యతిరేకమంటూ వత్యిరేకించడం తెలిసిందే.

Last Updated : Sep 25, 2020, 01:09 PM IST
Balineni Srinivasa Reddy: నిధులు మా జేబులో వేసుకోము.. TRS ప్రభుత్వానికి ఏపీ మంత్రి చురకలు

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే నిధులను మా జేబుల్లో వేసుకోకుండా ప్రజల ఖర్చుపెడతామన్నారు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy). తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బాలినేని ఇలా స్పందించారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంలో సఖ్యతగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అంతేకానీ తాము తెలంగాణ ప్రభుత్వంలాగ, ఓరోజు మద్దతు తెలిపి, మరోరోజు గొడవలకు దిగే రకం కాదంటూ టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వానికి చురకలు అంటించారు. Telangana Covid-19: లక్షన్నర దాటిన కోలుకున్న వారి సంఖ్య

రైతులకు ఉచిత విద్యుత్ బోర్లు అమర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరించామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం అందించే రూ.4వేల కోట్ల నిధులను ప్రజల కోసం ఉపయోగిస్తాం తప్ప.. మా జేబుల్లో వేసుకోవడం లేదని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు గ్రహించాలన్నారు. డిస్కంలకు చెల్లించాల్సిన బిల్లులను రైతుల అకౌంట్లలో జమచేస్తామని పేర్కొన్నారు. Ambedkar Open University Admissions: ఏయూలో ప్రవేశ గడువు పొడిగింపు

రాష్ట్ర ప్రజల అభివృద్ధికి పాటుపడతామని, అందుకోసమైనా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రైతులకు మరో 30 ఏళ్లపాటు ఉచిత విద్యుత్ అందించే విషయంలోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాట తప్పదంటూ ఏపీ రైతులకు మంత్రి బాలినేని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. YS Jagan: హుటాహుటిన హైదరాబాద్‌కు వైఎస్ జగన్.. నేరుగా ఆస్పత్రికి ఏపీ సీఎం 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News