Telangana Coronavirus Updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో పరీక్షలు ఎక్కువగా చేస్తుండటంతో నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24గంటల్లో గురువారం ( సెప్టెంబరు 24 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 2,381 కరోనా కేసులు నమోదు కాగా.. 10 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు. తాజాగా నమోదైన కేసులతో.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,81,627 కి చేరగా.. మరణాల సంఖ్య 1,080 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శుక్రవారం ఉదయం కరోనా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 1,50,160 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం తెలంగాణలో 30,387 యాక్టివ్ కేసులు ఉన్నాయి. Also read: Manish Sisodia: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి కరోనాతోపాటు డెంగీ
ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా గురువారం 57,621 కరోనా టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 27,41,836 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 82.67 శాతం ఉండగా.. మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. నిన్న అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో కొత్తగా 386 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 227, మేడ్చెల్ మల్కాజ్‌గిరిలో 193, నల్లగొండ జిల్లాలో 132 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి..