AP ప్రజలు హర్షం.. చంద్రబాబు, పెయిడ్ ఆర్టిస్టులు వ్యతిరేకం: మంత్రి బొత్స

ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు మాజీ సీఎం చంద్రబాబు, ఆయన పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని Botsa Satyanarayana విమర్శించారు. ఫ్లాప్ అయిన సినిమాకు వంద రోజుల ఫంక్షన్, సక్సెట్ మీట్ ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు, టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Last Updated : Oct 11, 2020, 02:26 PM IST
  • 13 జిల్లాల అభివృద్ధే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్యేయమన్న రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ
  • సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు
  • ఫ్లాప్ అయిన సినిమాకు వంద రోజుల ఫంక్షన్, సక్సెట్ మీట్‌లాగ చంద్రబాబు హడావుడి: మంత్రి బొత్స ఎద్దేవా
AP ప్రజలు హర్షం.. చంద్రబాబు, పెయిడ్ ఆర్టిస్టులు వ్యతిరేకం: మంత్రి బొత్స

13 జిల్లాల అభివృద్ధే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ధ్యేయమని రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) పేర్కొన్నారు. ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోనే రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు. వైఎస్సార్‌సీపీ నేత, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఫ్లాప్ అయిన సినిమాకు వంద రోజుల ఫంక్షన్, సక్సెట్ మీట్ ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు, టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అమరావతిలో ఉన్న తమ బినామీ ఆస్తులను కాపాడుకునేందుకు, తమ డొల్లతనం బయట పడుతుందనే భయంతోనే అధికార వికేంద్రీకరణ, 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మీ బినామీలు ఏ విధంగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేశారో ఏపీ ప్రజలు తెలుసుకుంటున్నారని, రూ.5 వేల కోట్లు ఖర్చుపెట్టి కేవలం ఫొటోలు మాత్రమే చూపించారని ఎద్దేవా చేశారు. ప్రతి కేసులు, విషయంలోనూ స్టేలు తెచ్చుకోవం తప్ప చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.

విశాఖ మెట్రో ప్రాజెక్ట్ డీపీఆర్ సిద్ధమవుతుందని, త్వరలో ఆఫీస్ కూడా ప్రారంభిస్తామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విశాఖ భూ కుంభకోణంపై త్వరలోనే సిట్ దర్యాప్తు పూర్తవుతుందని తెలిపారు. మాన్సాస్ వ్యవహారం కుటుంబ తగాదా కాగా.. ఈ అంశంలోనూ ఏపీ ప్రభుత్వంపై బురదజల్లే యత్నం మంచిది కాదని హితవు పలికారు. రాజ్యాంగంపై, న్యాయస్థానాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News