Alliance Politics: ఏపీలో రాజకీయాలు ముదురుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊపందుకుంటున్నాయి. పొత్తుల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ విమర్శలు సంధిస్తోంది.
ఏపీలో ప్రతిపక్ష పార్టీల్ని ఇరుకున పెట్టేందుకు అధికార పార్టీ సన్నద్ధమౌతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై పదే పదే మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్‌ను ఇరుకునపెట్టేందుకు వైసీపీ నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రశ్నలు సంధించారు. పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వాలని సూచించారు.
రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్..టీడీపీ, బీజేపీలతో కలిసి పోటీ చేయనున్నారా లేదా బీజేపీని వదిలి టీడీపీతో కలిసి పోటీ చేస్తారా అనేది చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ తోడుదొంగల్లా మారారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. చంద్రబాబు ముసుగే పవన్ కళ్యాణ్ అని అభివర్ణించారు. ప్రజలు తిరస్కరిస్తారనే భయంతోనే చంద్రబాబు పొత్తులకు వెంపర్లాడుతున్నారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. గతంలో కూడా చంద్రబాబు పొత్తు లేకుండా ఎన్నడూ పోటీ చేయలేదని చెప్పారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదని స్పష్టం చేశారు. అన్ని పార్టీలతో కలిసే చంద్రబాబు పోటీ చేయాలని..అదే తాము కోరుకుంటున్నామన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పటిలానే ఒంటరిగానే పోటీ చేస్తుందని..గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు. వైఎస్ జగన్ పాలనపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసముందని మంత్రి పెద్దిరెడ్డి గుర్తు చేశారు. 20198 మినహా మరెప్పుడూ చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లలేదని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.
Also read: Jagan key role in president election: రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకం కానున్న జగన్మోహన్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook