Jagan key role in president election: రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకం కానున్న జగన్మోహన్ రెడ్డి

Jagan key role in president election: రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్థాయిలో బలం లేకపోవడంతో ఇతర పార్టీలు కీలకంగా మారనున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలో  మద్దతు తెలుపాలంటే ఇతర పార్టీలు  కొన్ని కండిషన్స్ పెట్టె అవకాశం ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2022, 09:37 PM IST
  • రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ మొదలు పెట్టిన బీజేపీ
  • అభ్యర్థి ఎవరన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు
  • పూర్తి బలం లేకపోవడంతో మద్దతుకోసం చర్చలు
Jagan key role in president election: రాష్ట్రపతి ఎన్నికల్లో  కీలకం  కానున్న  జగన్మోహన్ రెడ్డి

Jagan key role in president election: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని నానుడి. నిజమే సమయం సందర్భం,  తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇతర పార్టీలకు ప్రత్యేక్షంగా పరోక్షంగా మద్దతు ఇస్తుంటారు. రాజకీయాలలో ఎవరు ఎప్పుడు మిత్రులు అవుతారో ఎప్పుడు శత్రువులు అవుతారో కూడా తెలియదు. రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నది సరిగ్గా సరిపోతుంది. మొన్నటి 5రాష్ట్రాల ఎన్నికలలో 4 రాష్ట్రాలలో గెలిచి సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం అంటూ పైకి  ఫుల్ జోష్‌లో ఉన్న బీజేపీకి ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నిక పెద్ద టాస్క్‌ల మారింది. జులై 25తో రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ పదవీకాలం ముగియనుండడంతో కొత్త రాష్ట్రపతి ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టింది బీజేపీ. రాష్ట్రపతి ఎన్నికను నిర్ణయించే ఎలెక్టోరల్ ఓట్ల సంఖ్య 10,98,903 ఉండగా అధికార బీజేపీకి 4,65,797 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఎన్డీయేలోని మిత్రపక్షాలకు 71,329 ఓట్లు ఉన్నాయి. మొత్తం కలిపి 5,37,126 ఓట్లు ఎన్డీయే అభ్యర్థికి దక్కనున్నాయి. కానీ బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని గట్టెంక్కించేందుకి మరో 9,194 ఓట్లు అవసరం ఏర్పడింది.

పార్లమెంట్ ఉభయ సభల్లో కలిపి బీజేపీకి పూర్తి బలం ఉన్నప్పటికీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్లు కీలకం కానున్నాయి. మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో యూపీలో దాదాపు 100 ఎమ్మెల్యే సీట్లు కోల్పోయారు. దీనితో ఇతర పార్టీల మద్దతు తప్పనిసరి అయింది. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో రాంనాథ్ కొవింద్ ఎన్నిక సమయంలో టిఆర్ఎస్, శివసేన,ఆప్, అకాలీదళ్ పార్టీలు మద్దతు తెలపడంతో ఎన్నిక సువులుగా జరిగిపోయింది. వివిధ కారణాలతో ఇప్పుడు టిఆర్ఎస్, అకాలీదళ్, ఆప్ పార్టీలు బీజేపీకి దూరం అయ్యాయి. కాబట్టి ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీలు బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలిపే అవకాశం లేదు. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో పూర్తి సంఖ్య బలం లేకపోవడంతో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రపతి  అభ్యర్థిని ప్రకటించకుండా ఇతర పార్టీల  మద్దతు కోరుతుంది.

రాష్ట్రపతి రేసులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరి పేరును బీజేపీ కన్ఫర్మ్ చేయలేదు. పూర్తిస్థాయిలో బలం లేకపోవడంతో ఎన్డీయేతర ముఖ్యమంత్రులతో తమకు మద్దతు ఇచ్చే పార్టీలతో కేంద్రమంత్రులు చర్చలు జరుపుతున్నారు. వైసీపీ, ఆర్జేడీ, బిజూ జనతాదళ్ నేతలతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చర్చలు జరిపారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకం కానున్న వైసీపీ..

రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ కీలకం కావడంతో జగన్మోహన్ రెడ్డి కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రాష్ట్ర సమస్యలను ఏకరువుపెడుతూ రాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. గత రాష్ట్రపతి ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపగా కొద్దిరోజులుగా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు రావడం మరోవైపు ఏపీలో బీజేపీ- టీడీపీ పార్టీల మధ్య పొత్తు చెడడం జగన్‌కు కలిసొచ్చింది. ఈ అవకాశాన్ని జగన్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బీజేపీకి దూరం కావడంతో జగన్ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల జగన్ పలుమార్లు రాష్ట్ర సమస్యల మీద ఢిల్లీ పర్యటనలు చేశారు. ప్రధాని మోడీ మరియు కేంద్రమంత్రులతో సమావేశం అయ్యారు. కేంద్రం కూడా జగన్ వ్యవహారంలో ఆచితూచి స్పందిస్తోంది. 

ఒకవేళ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థికి మద్దతు తెలుపాల్సివస్తే జగన్ కేంద్రం ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలు, ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి చేయూత అందించాలని కోరే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణంలో కూడా కేంద్రం ఆర్థిక సాయం చేయాలని కోరనున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో  వైసీపీ ప్రతిపాదనలు ఆమోదించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవంగా గెలిపించుకోవాలిసిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు అన్నీ కలిసి అభ్యర్థిని నిలబెడితే బీజేపీకి కొంత క్లిష్ట పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా కొంతకాలంగా బీజేపీతో దూరంగా ఉంటూ వస్తున్నారు. కాబట్టి ఈసమయంలో రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ (AP CM YS Jagan) కీలకంగా మారారు. కాబట్టి జగన్ ప్రతిపాదనల మీద కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : CM Jagan Review: రాజధాని పనులు వేగవంతం చేయండి.. సీఎం జగన్ ఆదేశం

Also Read : Somu Veerraju Comments: పొత్తులపై సోమువీర్రాజు ఏమన్నారంటే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News