Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు తప్పింది. అయినప్పటికీ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం రెండు మూడ్రోజుల్లో వాయుగుండంగా మారి తీవ్రతరం కానుందని పేర్కొన్న సంగతి తెలిసిందే కదా. అయితే, ఆ వాయుగుండం వాయువ్యంగా పయనిస్తూ ఉత్తర ఒడిశా, బెంగాల్ తీరాలకు చేరుకోనుందని తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు తప్పినట్లయింది. కానీ, ఈ ప్రభావంతో ఈ నెల 8 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా పరిసరాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. రాబోయే రెండురోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు చేరువగా వెళ్లే అవకాశముందని వాతావరణ శాఖ తెలియజేసింది. రాజస్థాన్, హరియాణా, మధ్యప్రదేశ్ మీదుగా అల్పపీడన కేంద్రం వరకు, అక్కడి నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది.
దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు. కోస్తాంధ్రలో పలుచోట్ల భారీవర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
రాబోయే మూడు రోజులు సముద్రం అలజడిగా ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు గరిష్ఠంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. గురువారం పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విశాఖపట్నం, నంద్యాల, గుంటూరు, కాకినాడ తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు అత్యధికంగా విజయనగరం జిల్లా కొత్తవలసలో 94.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.