Andhra Pradesh: సీమలో మంత్రి పదవులు ఎవరిని వరించనున్నాయి..?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గ విస్తరణపై క్లారిటీ ఇవ్వడంతో ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మంత్రి కావాలనే ఉద్దేశంతో ఉన్న అవకాశాలను ఎవరూ వదులుకోవడం లేదు. కర్నూలు జిల్లాలో మంత్రి రేస్ లో ఉన్న వారి పై స్పెషల్ స్టోరీ.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2022, 05:07 PM IST
  • ఈ ఉగాదికి ఏపీలో కొత్త మంత్రి వర్గ విస్తరణ
  • రేసులో సీనియర్ ఎమ్మెల్యేలు, కొత్త ఎమ్మెల్యేలు
  • ఆసక్తిగా ఎదురు చూస్తున్న కర్నూల్ ప్రజలు
Andhra Pradesh: సీమలో మంత్రి పదవులు ఎవరిని వరించనున్నాయి..?

Andhra Pradesh: కర్నూలు జిల్లా వైఎస్ కుటుంబానికి ఎప్పుడు అండగనే నిలుస్తూ వస్తుంది. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ, రెండూ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వలోని కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వచ్చాయి. ఆయన తరువాత 2014 లో టీడీపీ హయంలో కూడా 11ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ పార్టీ జిల్లాలో గెలుచుకుంది. వైఎస్ జగన్ పాదయాత్ర తరువాత 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా ను స్వీప్ చేసింది. 14కు 14కు మంది వైసీపీ నుంచే ఎమ్మెల్యేలుగా గెలిచారు. రెండు పార్లమెంట్‌ సీట్లు కూడా వైసీపీకే వచ్చాయి. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో శిల్పా మోహన్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేయగా, రోశయ్య మంత్రి వర్గంలో టీజీ వెంకటేష్, ప్రతాప్ రెడ్డి మంత్రులుగా సేవలు అందించారు. టీడీపీ ప్రభుత్వంలో కేఈ కృష్ణమూర్తి మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనురు జయరాం ప్రస్తుతం మంత్రి వర్గంలో కొనసాగుతున్నారు. 

ఇక జిల్లా నుంచి 14 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలుపొందారు. వీరిలో ఒకరు మైనార్టీ, ఒకరు బీసీ, ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గం వారు ఉన్నారు. మిగతా 10 స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గం వారు గెలిచారు. వైఎస్ జగన్ కేబినెట్ లో అందరికీ న్యాయం చేయాలని ఉద్దేశంతో బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి, గుమ్మనూరు జయరాంకు అవకాశం వచ్చింది. ఈ సారి ఎవరికి మంత్రి పదవి వస్తుందో అని జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గతంలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డరు.

ఈ ఉగాదికి కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తుండడంతో జిల్లాలోని సీనియర్ ఎమ్మెల్యేలు, కొత్త ఎమ్మెల్యేలు మంత్రి రేస్ లో ఉన్నారు. కర్నూలు,  నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంది. కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, మంత్రాలయం నుంచి బాలానాగిరెడ్డి రేస్ లో ఉన్నారు. మరో వైపు నంద్యాల పార్లమెంట్ పరిధిలో శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి రేస్ లో ఉన్నారు. సామాజిక వర్గాల వారికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి కర్నూలు పరిధిలో సుధాకర్, నంద్యాల పరిధిలో నుంచి ఆర్థర్ ఉన్నారు. మైనారిటీకి ఇవ్వాలని  చూస్తే కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ లైన్ లో ఉన్నారు. మహిళకు ఇవ్వాలనుకుంటే పత్తికొండ ఎమ్మెల్యే కంగటి శ్రీ దేవీ ఉన్నారు. 

అయితే వీరంతా మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయితే ఈసారి సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఆ ప్రకారంగా కర్నూల్ ఎమ్మెల్యే కు, నందికొట్కూరు ఎమ్మెల్యే కు ఎక్కువ అవకాశం ఉంది. అయితే ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన ను కొనసాగిస్తే నంద్యాల పార్లమెంట్ నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నా వారికీ భంగపాటు తప్పదు. మరీ  గతంలో పలుసార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన సీనియర్లకు ఇస్తారా లేదా సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా కొత్తవారికి మంత్రి పదవి ఇస్తారా అనేది వైఎస్ జగన్ నిర్ణయంపై ఆధారపడి ఉంది.

Also Read: Mahesh Babu New Look: సెకండ్ సింగిల్‌కు ముహుర్తం ఫిక్స్.. ఇయర్‌బడ్స్‌ పగిలిపోయడం ఖాయం! మహేష్ లుక్ అదిరిపోలా!

Also Read: Harbhajan Singh: హర్భజన్ సింగ్‌కు బంపర్ ఆఫర్.. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభకు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News